BREAKING
తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు
www.ntodaynews.com

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం

తెలంగాణ
13 Jun, 2025 - 09:23 AM
339 వీక్షణలు
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం--యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు N TODAY NEWS: భువనగిరి మహిళా శిశు,దివ్యాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ,యాదాద్రి భువనగిరి జిల్లా, వారి ఆధ్వర్యంలో శుక్రవారం రోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్బంగా ఈ రోజు ఉదయం 10.00 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల భువనగిరి ఆవరణలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవ ర్యాలీ జెండా ఊపి ప్రారంబించారు.బాలకార్మిక నిర్మూలన దినోత్సవానికి సంబంధించిన పోస్టర్స్ మరియు కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లడుతూ బాల కార్మిక చట్టాల గురుంచి మరియు కర్మగారాలు ఫ్యాక్టరీ,హోటల్స్,కిరాణ షాపులు,ఇటుక బట్టీలు,కోళ్ల ఫారాలలో 18 సంవత్సరాల లోపు బాలలను పనులలో పెట్టుకున్నట్లయితే యాజమనులపై కేసులు నమోదు అవుతాయని.ఒకవేళ పిల్లలను పనిలో పెట్టుకున్నట్లయితే 2 సంవత్సరాల జైలు శిక్ష 50 వేల రుపాయాల జరిమాన విధించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి గ్రామాలలో,పట్టణాలలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనా చట్టాల గురించి అవగాహన కార్యక్రమాలు జరిపించాలన్నారు.అనంతరం జిల్లా సంక్షేమ అధికారి నరసింహ రావు ర్యాలీలో పాల్గొని షాపు యజమానులు బాల కార్మికులను పనిలో పెట్టుకోకూడదని కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ నాగిరెడ్డి,డిఐఈఓ రమణీ , జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పాపిరెడ్డి ,సిడీపిఓ శైలజ, జిల్లా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మోయిజుద్దీన్ ,జిల్లా బాలల పరిరక్షణ విభాగం ,సఖీ విభాగం, డిఎల్ఎస్ఏ సిబ్బంది,జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది,స్కోప్ ఎన్జిఓ,అంగన్వాడీ టీచర్లు ,విద్యాశాఖ సిబ్బంధి , విద్యార్ధులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube