ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం

Spread the love

ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం — జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఎంఈఓ సైదా నాయక్

NTODAY NEWS:రిపోర్టర్ కూనురు మధు

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని చిన్న కాపర్తి, పెద్ద కాపర్తి, చిట్యాల గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆదేశానుసారం శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల పట్టణ కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి జి.మాధవి ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయినీ , ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. చిట్యాల మండల విద్యాధికారి సైదా నాయక్ మాట్లాడుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో గరిష్ట సంఖ్యలో చేరే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో గొప్ప కార్యక్రమాలను రూపొందించిందని , అత్యంత అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన ఉంటుందని , విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాల తో పాటుగా నాణ్యమైన రెండు జతల యూనిఫామ్ లు అందించి ప్యూరిఫైడ్ వాటర్ తో కూడిన రాగి జావ పౌష్టికారంతో కూడిన మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేస్తుందని అన్నారు , అదేవిధంగా పీ.ఎం.శ్రీ పథకం ద్వారా విద్యార్థినీ , విద్యార్థులకు ప్రతి సంవత్సరం విజ్ఞాన విహారయాత్రలు , క్షేత్రస్థాయి పర్యటనలు , ఎక్స్ ఫ్లోజర్ టూర్ సౌకర్యాలు కల్పిస్తుందని , అదేవిధంగా గ్రీన్ స్కూల్ , ఏక్తాభారత్ , శ్రేష్టభారత్ , ఫైనాన్షియల్ లిటరేసి , మ్యాథ్స్ అండ్ సైన్స్ సర్కిల్స్ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు అంతేకాకుండా ఎస్సీ , ఎస్టీ విద్యార్థులకు స్కాలర్ షిప్ సౌకర్యం , బాలికలకు ఆత్మ రక్షణ కొరకు ప్రత్యేక కరాటే శిక్షణ కార్యక్రమాలు కూడా ప్రభుత్వ స్కూళ్లలో నేర్పించడం జరుగుతుందని అన్నారు . ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు గణనీయమైన విజ్ఞాన మేదస్సులు మెరుగుపడతాయని , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ వారు కల్పిస్తున్న ఇటువంటి సువర్ణవకాశాన్ని విద్యార్థులు , తల్లిదండ్రులు సద్వినియోగ పరుచుకుని విద్యార్థినీ విద్యార్థులను అత్యంత ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల పి.ఎం.శ్రీ. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవి, పెద్ద కాపర్తి ప్రధానోపాధ్యాయులు, లుకందర్ రెడ్డి, ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు , బోధనేతరసిబ్బంది , అంగన్వాడి కార్యకర్తలు , ఆశా వర్కర్లు , విద్యార్థుల తల్లిదండ్రులు , పూర్వ విద్యార్థులు , మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు .

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top