శ్రీదత్తసాయి సన్నిధిలో మహాలయ అమావాస్య పూజ,పేదలకు రిక్షా కార్మికులకు,అన్న సంతర్పణ కార్యక్రమం

Spread the love

చిలకలూరిపేట(ఎన్ టుడే న్యూస్) రిపోర్టర్-రావిపాటి రాజా…!!

చిలకలూరిపేట సుబ్బయ్య తోట శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసియున్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈరోజు భాద్రపద మాస అమావాస్య మహా లయ అమావాస్య సందర్భంగా దత్త సాయి సన్నిధిలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగి ఉన్నాయి అనంతరం పేదలకు రిక్షా కార్మికులకు పట్టణ ప్రముఖులు చార్టెడ్ అకౌంటెంట్ అన్నదాత గారి ఆర్థిక సహకారంతో వారి పితృదేవతల పేరుమీద అన్న సంతర్పణ జరిగింది, దత్త సాయి సన్నిధి నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ మహాలయ పక్షాల్లో అతి శక్తివంతమైన రోజు మహాలయ అమావాస్య అని ఈ రోజున ఎవరైతే వారి పెద్దల పేరు మీద అన్న సందర్భంగా చేస్తారో వారి యొక్క ఆశీర్వాదం లభిస్తూ ఉందని దేవతల కంటే శక్తివంతులు పితృదేవతలని ఈ రోజున పితృదేవతా స్తోత్రం మరియు గతించిన వారి పేరు మీద పితృదేవతల పేరు మీద అన్నసంతర్పణ చేయడం చాలా విశేషమని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పాశం అన్నదాత గారు వారి సిబ్బంది పాల్గొన్నారు