మండల కమిటీ ఎన్నిక

Spread the love

చిట్యాల సర్పంచుల ఫోరం మండల కమిటీ ఎన్నిక

-అధ్యక్షుడిగా పెద్దకాపర్తి సర్పంచ్ కాటం వెంకటేశం

NTODAY NEWS : చిట్యాల

నల్గొండ జిల్లా చిట్యాల మండల సర్పంచుల ఫోరం ఎన్నికలు చిట్యాల పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో మండల అధ్యక్షుడిగా పెద్దకాపర్తి సర్పంచ్ కాటం వెంకటేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా తాళ్లవెల్లంల సర్పంచ్ జోగు సురేష్, ప్రధాన కార్యదర్శిగా సుంకెనపల్లి సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య, కార్యదర్శిగా నేరడ సర్పంచ్ మిర్యాల వెంకటేష్, కోశాధికారిగా వనిపాకల సర్పంచ్ కె. మహిపాల్ రెడ్డి ఎన్నికయ్యారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా ఆవుల సుందర్, మేడి శ్రీలత, అందే అండాలు, భాను శ్రీ, యాదమ్మలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కాటం వెంకటేశం మాట్లాడుతూ, చిట్యాల మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులను సమన్వయం చేసుకుని, సర్పంచుల సమస్యలను ఉమ్మడిగా పరిష్కరించే దిశగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »