రోడ్డు ప్రమాదంలో మరణించిన గ్రామపంచాయతీ కార్యదర్శికి నివాళులర్పించిన బొమ్మలరామారం మండల పంచాయతీ కార్యదర్శులు
NTODAY NEWS: బొమ్మలరామారం జూన్ 10
ఖమ్మం జిల్లా,పెనుబల్లి మండలం వీ.ఎం.బంజర్ లో జాతీయ రహదారి పై సోమవారం రోజున రోడ్డు ప్రమాదం జరిగింది అతి వేగంగా వచ్చిన లారీ స్కూటీని ఢీకొట్టడంతో స్కూటి పై ప్రయాణిస్తున్న పంచాయితీ కార్యదర్శి బాణోత్ సోనాలి(33) అక్కడికక్కేడే మృతి చెందింది మృతురాలు పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ గ్రామ పంచాయితీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు వారి మరణానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం ఎంపీడీవో కార్యాలయంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల వివిధ గ్రామాల గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.