BREAKING
చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం
www.ntodaynews.com

బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు

తెలంగాణ
27 Dec, 2025 - 07:05 PM
320 వీక్షణలు

కాంగ్రెస్ విడిచి బిఆర్ఎస్‌లో చేరిన నాయకులు

NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ శనివారం  జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో సారంగాపూర్ మండలం లక్ష్మిదేవి పల్లె గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మీ మరియు వారి 50 మంది అనుచరులు కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. అలాగే ధర్మానాయక్ తండా నుండి చందు నాయక్ మరియు వారి 10 మంది అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో విసుగు చెంది మళ్లీ కేసీఆర్ వస్తేనే పల్లెలు మరియు తండాలు అభివృద్ధి చెందుతాయని కాంగ్రెస్ పార్టీని విడిచి బిఆర్ఎస్ పార్టీలో చేరామని తెలిపారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే స్థాయిని మరిచిపోయి సోయి తప్పి అరుస్తున్నాడని, ఫ్రస్టేషన్‌తో ఎందుకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నావని ప్రశ్నించారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నల్లో తెలంగాణ నీళ్లను ఆంధ్రకు ఎలా అప్పజెప్పిన గుట్టు బయటపడిందని, అందుకే ఫ్రస్టేషన్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడని విమర్శించారు. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ పెట్టి నిగ్గ తీసి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలయాపన చేస్తున్నాడని అన్నారు. గురు–శిష్యుల బంధం బయటపడిందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తేలు రాజు, సర్పంచులు సంతోష్, భారతి, చిరంజీవి, బిఆర్ఎస్ నాయకులు సాగి సత్యం రావు, చిట్ల రమణ, ధరిశెట్టి రాజేష్, మారు సాయి రెడ్డి, అనంతుల గంగారెడ్డి, ఎండబెట్ల వర ప్రసాద్, భాస్కర్, బైరి మల్లేష్, జగన్, రమేష్, సాంబారి గంగాధర్, భీమా నర్సయ్య, తిరుపతి, జలంధర్, సుమన్ నాయక్, నరేష్, భాస్కర్ నాయక్, సురేష్, బిఆర్ఎస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube