భవిష్యత్తులో మరిన్ని పతకాలను సాధించాలి

Spread the love

భవిష్యత్తులో మరిన్ని పతకాలను సాధించాలి,ఉత్తమ పోలీసులకు సేవా పతకాలు అందజేసిన రాచకొండ సీపీ సుధీర్ బాబు

NTODAYNEWS: రాచకొండ కమిషనరేట్

విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి రాచకొండ పోలీస్ కమీషనరేట్ నేరెడ్మెట్ లో ఈరోజు రాచకొండ సీపీ సుధీర్ బాబు చేతుల మీదుగా పోలీస్‌ సేవా పతకాలను అందుకున్నారు.ఈ సందర్భంగా సేవా పతకాలను అందుకున్న వారిని సిపి అభినందించారు.అనంతరం వారితో మాట్లాడుతూ విధి నిర్వహణలో అసామాన్యమైన ప్రతిభను కనబరిచిన పోలీస్ సిబ్బందికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సేవా పతకాల ద్వారా గుర్తిస్తారని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సరం 2025 మరియు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (జూన్ 2, 2025) సందర్భంగా పథకాలు వచ్చిన వారికి ఉత్తమ సేవ మరియు సేవ పథకాలు అందజేయడం జరిగింది. అందులో భాగంగా రాచకొండ కమీషనరేట్ పరిధిలో 65 మంది పోలీసు సిబ్బందికి పతకాలు అందచేశామన్నారు.వీరిలో కానిస్టేబుల్ నుంచి అడిషనల్ డీసీపీ ర్యాంక్ వరకూ ఉన్నారన్నారు.పోలీసు శాఖలో విధులు నిర్వహించడం,అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎటువంటి రిమార్కులు లేకుండా పతకాలు స్వీకరించడం ఆనందదాయకమని,ఇదే స్ఫూర్తితో విధుల పట్ల అంకితభావం,మంచి ప్రతిభ కనబరిచి,ప్రజలకు పోలీసు వారి సేవలను అందించాలని,అదేవిధంగా పోలీసు శాఖకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చేలా విధులు నిర్వహించాలని సీపీ తెలిపారు. రానున్న రోజుల్లో ఇంకా బాగా పనిచేసి ప్రజలకు మెరుగైనా సేవలు అందించి ప్రభుత్వము నుంచి మరిన్ని పతకాలు సాధించాలన్నారు. అలాగే ఇతర సిబ్బంది కూడా పతకాలను అందుకున్న వారిని స్ఫూర్తిగా తీసుకొని తాము కూడా పతకాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం భువనగిరి ఏసిపిగా పని చేస్తున్న రాహుల్ రెడ్డి కి అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ రావడంతో సిపి అతన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో డిసిపి మల్కాజిగిరి పద్మజ,ఎల్బి నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్,భువనగిరి డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి, డీసీపీ క్రైమ్స్ అరవింద్ బాబు, డీసీపీ అడ్మిన్ ఇందిరా, ఎస్వోటి డీసీపీ రమణ రెడ్డి,ఎస్బి డీసీపీ జి నరసింహ రెడ్డి,ట్రాఫిక్ ట్రాఫిక్ డీసీపీ – 1 మనోహర్, ట్రాఫిక్ డీసీపీ – 2 శ్రీనివాసులు, డీసీపీ సైబర్ క్రైమ్ నాగలక్ష్మి,డీసీపీ హెడ్ క్వార్టర్ శ్యాంసుందర్,అడిషనల్ డీసీపీలు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »