వృధాశ్రమంలో వైద్య శిబిరం
NTODAY NEWS: ఎల్బీనగర్
రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ మరియు MYG సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో వైద్య శిబిరం నిర్వహించి, బిపి, షుగర్, కంటి మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు అవసరమైన మందులను అందించారు. ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి తక్షణమే ముందుకు వచ్చినందుకు కామినేని ఆసుపత్రికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమాన్ని సాధ్యం చేయడంలో విలువైన సహాయాన్ని అందించిన వృద్ధాశ్రమ వ్యవస్థాపకుడు శంకర్ మరియు ప్రకాష్ యాదవ్, సతీష్ గౌడ్, లయన్స్ క్లబ్ వనస్థలిపురం కృష్ణ కిషోర్ కామేనేని హాస్పిటల్ శ్రీధర్ . నరేష్ గౌడ్,కుంచా సాయికిరణ్ గౌడ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.













