జనసేన కార్యకర్త రమేష్ భార్య కిడ్నీ ఆపరేషన్ నిమిత్తం నేరుగా ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే మద్దిపాటి
సాధారణ జనసేన కార్యకర్త తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన ఉన్నమట్ల రమేష్ భార్య సత్యలక్ష్మి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు సీఎం సహాయనిధి నుండి రూ. 6,30,000 /- సహాయం అందించిన ఎమ్మెల్యే మద్దిపాటి.
ఒక సామాన్యమైన పేద కుటుంబం జనసేన కార్యకర్త అయిన ఉన్నమట్ల రమేష్ భార్యకు కిడ్నీ సమస్య వలన వైద్యులు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాలని సూచించారు.రెక్కాడితే గానీ, డొక్కాడని కుటుంబం ఆపరేషన్ కు అన్ని లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకోలేని పరిస్థితి.ఈ విషయాన్ని కుటుంబసభ్యులు జనసేన కార్యకర్తలు గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు గారి దృష్టికి తీసుకువెళ్లి మీరే ఆదుకోవాలని కోరారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి సహాయం అందేలా చూస్తాను అన్నారు. వీరు LOC కి అప్లై చేసుకోగా రూ.2,00,000 లక్షలు మంజూరు చేశారు కానీ ఆపరేషన్ కు సరిపోదు అని మరలా స్వయంగా సీఎంఆర్ఎఫ్ అధికారులతో మాట్లాడగ వారు రూ. 3,60,000 మంజూరు చేయడం జరిగింది.కానీ నిరుపేద కుటుంబం ఇప్పటికే వైద్య ఖర్చుల నిమిత్తం అంత అయ్యిపోయింది ఆర్థికంగా చితికిపోయారు. మా దగ్గర ఆపరేషన్ కు సరిపడా డబ్బులు లేవు అని మరలా ఏమ్మెల్యే గారి దగ్గరకి రాగానే మన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు ఆ కుటుంబానికి అండగా నిలిచి, ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా కలసి రూ. 6,30,000/- లక్షలు చెక్కును మంజూరు చేయించి,ఇంకా ఆపరేషన్ కి అవసరమైతే సొంత డబ్బును కూడా ఇస్తా అని హామీ ఇచ్చారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube