పారిశుద్ధ్య కార్మికులకు అండగా MLA సునీతా లక్ష్మరెడ్డి నిరసన
NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ నర్సాపూర్ ప్రతినిధి,
నర్సాపూర్ నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ పారిశుద్ధ్యనికి సంబందించిన శానిటైజర్ నిదులను అలాగే గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలను వెంటనే విడుదల చెయ్యాలి అని కౌడిపల్లి మండల కేంద్రంలోని MPDO కార్యలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు మరియు బి.ఆర్.యస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టిన MLA సునీతా లక్ష్మరెడ్డి అనంతరం ఎంపీడీఓకి మెమోరాండం సమర్పించి, గత బి ఆర్ యస్ ప్రభుత్వంలొ గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం KCR ఎంతో పాటుపడ్డాడు అని దేశంలొ తెలంగాణ పల్లెలను ఆదర్శంగా తీర్చిదిద్దరు అని ప్రతి గ్రామ పంచాయతీకీ ట్రాక్టర్ లు డాంప్యార్డ్లు పల్లె ప్రకృతి వనాలు వైకుంఠదామలను నిర్మించిన ఘనత KCRది అని ఆమె తెలియజేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులని విడుదల చెయ్యకపోవడంతో పాటు కనీసం పారిశుద్ధ్య ట్రాక్టర్ లను నడపడంలొ ఫెల్ అయ్యింది అని కాంగ్రెస్ ప్రభుత్వం పై MLA సునీతా లక్ష్మరెడ్డి తీవ్రస్థాయిలో ద్వాజమెత్తరు.













