
కార్మిక–రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మోడీ, ట్రంప్ దిష్టిబొమ్మల దగ్ధం
సీఐటీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో చిట్యాలలో నిరసన కార్యక్రమం
NTODAY NEWS: చిట్యాల
కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారనే ఆరోపణలతో ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మలను సోమవారం సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకుడు అవిశెట్టి శంకరయ్య మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడితో చేసుకున్న ఒప్పందాల ద్వారా భారత దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టే విధంగా స్వేచ్ఛా వాణిజ్య విధానాలను ప్రధాని మోడీ అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది దేశ ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నారు.కార్మికుల హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయడం, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం, విద్యుత్ సవరణ చట్టం, విత్తన సవరణ చట్టం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వంటి విధానాలను మోడీ ప్రభుత్వం ముందుకు తీసుకువస్తోందని విమర్శించారు. ఈ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెలో రైతులు, కార్మికులు, కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఐతరాజు నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు ఆరూరి శ్రీనివాస్, లడే రాములు, నర్సిరెడ్డి, మహేష్, సత్యనారాయణ, కిరణ్, శేఖర్, ఐలమ్మ తదితరులు పాల్గొన్నారు.
#Chityala
#FarmersProtest
#WorkersProtest
#CITU
#NationwideStrike
#LabourRights
#FarmerIssues
Follow us on
Website
Facebook
Instagram
YouTube













