అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలిసిన MRPS–MSP నాయకులు
NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు
మదనపల్లి పట్టణాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించిన నేపథ్యంలో MRPS–MSP నాయకులు జిల్లా కలెక్టర్‌ను, ఎమ్మెల్యే షాజహాన్ బాషాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమం MSP జాతీయ నాయకులు నరేంద్రబాబు నేతృత్వంలో జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మదనపల్లి ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన జిల్లా కేంద్రంగా మదనపల్లిని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే పుంగనూరు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో కలపడం పట్ల కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఒకే భాష, ఒకే కట్టుబొట్టు, ఒకే ఆచారాలతో నడిచే మండలాలను ఒకే జిల్లాగా ఏర్పాటు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేసిన సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే చారిత్రాత్మక నేపథ్యం కలిగిన మదనపల్లి అస్తిత్వం దెబ్బతినకుండా, భవిష్యత్తులో జిల్లా పేరు మదనపల్లి పేరుతోనే ఉండేలా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో MSP జాతీయ నాయకులు నరేంద్రబాబు మాదిగతో పాటు మదనపల్లి MSP సీనియర్ నాయకులు వాసు మాదిగ, అన్నమయ్య జిల్లా MRPS అధ్యక్షులు రవీంద్ర (రవి), ఉమ్మడి చిత్తూరు జిల్లా సీనియర్ నాయకులు పుంగనూరు నరసింహులు, పుంగనూరు మండల నాయకులు వరగాని ప్రభాకర్ (చిట్టి), వెంకటరమణ (శంభు), నరసింహులు, మదనపల్లి సీనియర్ నాయకులు మనోహర్, అండగల్లు రమణ, అన్నమయ్య జిల్లా MSP నాయకులు చంబకూర్ రాజేష్, తంబళ్లపల్లి నియోజకవర్గ నాయకులు ప్రతాప్, తిరుపాలు, వెంకటరమణ, కురుబలకోట మండల నాయకులు సుధాకర్ కుమార్, చౌడేపల్లి మండల నాయకులు పగడాల గోవిందు, సీనియర్ నాయకులు ఎస్. రెడ్డప్ప, నూతన కుమార్ తదితరులు పాల్గొన్నారు.













