దేశంలో తెలంగాణ రాష్ట్రం ను నెంబర్ వన్ ఎకానమీ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం

Spread the love

దేశంలో తెలంగాణ రాష్ట్రం ను నెంబర్ వన్ ఎకానమీ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

NTODAY NEWS: తుర్కపల్లి, జూన్ 06

ప్రజలు సహకరిస్తే తెలంగాణను 10 ఏళ్లలో వన్ ట్రిలియన్ ఎకానమీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు.శుక్రవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలంలోని తిరుమలపూర్ గ్రామంలో సుమారు 1051.45 కోట్ల రూపాయల విలువచేసే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ పేద ప్రజలు దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు అయ్యేలా నిలబెడతానని, జపాన్,సింగపూర్ సరసన రాష్ట్రాన్ని నిలుపుతానని అన్నారు. దేశంలో వందేళ్లలో ఎవరు చేయని విధంగా మొదటిసారి కులగణను చేపట్టి రాష్ట్రంలో 56.36% బలహీన వర్గాలు ఉన్నారని లెక్కలు తీశామన్నారు. విద్యా, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నామన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేయడంలో భాగంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడమే కాకుండా,600 బస్సులను స్వయం సహాయక మహిళా సంఘాలకు ఇచ్చి వారు వ్యాపార రంగంలో రాణించే విధంగా చేశామని,ఇందిరా మహిళ శక్తి  క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, అమ్మ ఆదర్శ పాఠశాల పనులను, పాఠశాల యూనిఫామ్ కుట్టే బాధ్యతలను మహిళలకు అప్పగించమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు నాలుగు లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని,గతం నుండి పేదోడు ఇందిరమ్మ ఇండ్లలోనే ఉంటున్నాడని చెప్పారు. ఆలేరు నియోజకవర్గాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామని, ఎట్టి పరిస్థితులలో గంధమల్ల రిజర్వాయర్ ను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీ అన్ని వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకునే విధంగా 100 నియోజకవర్గాలలో 20వేల కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ప్రైవేట్ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించామన్నారు. ఆరు నూరైన మూసీ నదిని ప్రక్షాళన చేసి గోదావరి నది జలాలతో మూసిని నింపుతామని తెలిపారు. గత 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులపై 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే ఎస్ఎల్బీసీకి, డిండికి నిధులు ఎందుకు ఇవ్వలేదని? ఎందుకు పూర్తి చేయలేదని ?ముఖ్యమంత్రి ప్రశ్నించారు.తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ కు టిటిడి లాగే వైటిడి (యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్ మెంట్)బోర్డ్ ని ఏర్పాటు చేసుకోబోతున్నామని, తిరుపతిలో పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం మాదిరిగానే ఇక్కడ చేపట్టే ప్రభుత్వ వైద్య కళాశాలను యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తామని, అలాగే విద్యాసంస్థలను యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లి దేశంలోనే గుర్తింపు ఉన్న యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. గత ప్రభుత్వం యాదగిరిగుట్ట మీద ఎవరు నిద్రించకూడదని నిషేధం విధిస్తే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిషేధాన్ని తొలగించి గుట్టపైకి వెళ్లే విధంగా ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ సన్న బియ్యం ద్వారా 80% ప్రజలకు కడుపునిండా అన్నం పెడుతున్నామని, సన్న బియ్యం పై 11,000 కోట్లు ఖర్చు చేసి ప్రతి ఒక్కరికి ఆరు కేజీల బియ్యం ఇస్తున్నామని చెప్పారు.దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న గంధమల్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను 574 కోట్లతో చేపట్టి పూర్తి చేయనున్నామని, రిజర్వాయర్లో ఎక్కువ గ్రామాలు ముంపునకు గురికాకుండా రిజర్వాయర్ సామర్ధ్యాన్ని 1.4 టీఎంసీలకు తగ్గించి 60 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా రూపొందించడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం ఎస్ఎల్బిసి,డిండి ప్రాజెక్టుల తో పాటు, కృష్ణా నదిపై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రజక్టులను చేపట్టలేదని చెప్పారు.తమ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు .ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, బునియదిగానీబ కాలువ అన్నింటిని పూర్తి చేస్తామని, అయితే లిఫ్ట్ ఇరిగేషన్ల కింద భూసేకరణను పూర్తి చేసే బాధ్యతను సంబంధిత శాసనసభ్యులు తీసుకోవాలన్నారు.. గత ప్రభుత్వం డిండి కి ఎక్కడినుండి నీరు తీసుకోవాలో గుర్తించలేకపోయిందని, అలాంటిది తాము 1800 కోట్ల రూపాయలతో ఎదుల రిజర్వాయర్ నుండి డిండి ప్రాజెక్టునుమొదలు పెట్టబోతున్నమని,తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఎస్ఎల్ బి ని పూర్తి చేస్తామని చెప్పారు.తుమ్మడి హట్టి ప్రాజెక్టుకు నీళ్లు తీసుకువచ్చిన విధంగానే, గంధమళ్లకు నీళ్లు తీసుకువచ్చి సకాలంలో పూర్తి చేస్తామని. చెప్పారు .రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని,సన్న బియ్యంతో పేదవాడికి రెండు పూటలా అన్నం పెడుతున్నామని,ఇచ్చిన వాగ్దానాలే కాకుండా,ఇవ్వని వాటిని కూడా నెరవేరుస్తున్నామని, ఆలేరు నియోజకవర్గంలో మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వనున్నమని,యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో తాగునీటితో పాటు,ఇండ్లు,డ్రైనేజిలు అన్ని కట్టిస్తామని తెలిపారు. భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి చేస్తున్న పథకాలను వివరించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ నియోజక వర్గంలో ఏఎంఆర్ పి కింద మిగిలిపోయిన 10 కిలోమీటర్ల ఉపకాలువ పనులకు నిధులు ఇచ్చి పూర్తి చేయాలని,తుర్కపల్లి మండలానికి ఇండస్ట్రియల్ పార్కు మంజూరు చేయాలని, గుండాల కాల్వపనులకు నిధులు మంజూరు చేయాలని, బొమ్మలరామారంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు తీర్చాలని, కష్టాల్లో ఉన్న మదర్ డైరీ ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.అంతకుముందు ముఖ్యమంత్రి 574.56 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గంధమల్ల రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేశారు.200 కోట్ల రూపాయలతో నిర్మించే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి,యాదాద్రి భువనగిరి జిల్లాలో 183 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఒకటో వార్డు నుండి 12వ వార్డులలో 25.50 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు,బిటి రోడ్లు ,స్ట్రాం వాటర్ డ్రైనేజీ పనులకు పనులకు ,7.50 కోట్ల రూపాయల వ్యయంతో కొలనుపాక లో చేపట్టనున్న
హెచ్ ఎల్ బి నిర్మాణ పనులకు , 6 కోట్ల రూపాయల వ్యయంతో కల్వలలో చేపట్టే హెచ్ ఎల్ బి నిర్మాణ పనులకు,మోట కొండూరు మండల కేంద్రంలో 8.25 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న తహసిల్దార్,ఎంపీడీవో,పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణానికి యాదగిరి గుట్ట మండలం దాతర్ పల్లి గ్రామంలో 22.75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాం పనులకు,21.14కోట్ల రూపాయల వ్యయంతో ఆలేరు నియోజక వర్గంలో సి ఆర్ ఆర్, ఎం ఆర్ ఆర్ పనులతో చేపట్టే బిటి రోడ్ల పనులకు , ఆలేరు మార్కెట్ యార్డులో 2.75 కోట్లు రూపాయల వ్యయంతో చేపట్టనున్న 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాం పనులకు శంకుస్థాపన చేశారు . ఈ సందర్భంగా ముగ్గురు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు.అంతేకాక స్వయం సహాయక మహిళా సంఘాలకు 54 కోట్ల 70 లక్షల రూపాయల బ్యాంక్ లింకేజీ చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్క, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ,కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం ,మందుల సామెల్,ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, తీన్మార్ మల్లన్న, శ్రీపాల్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా ఆమిథ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, భువనగిరి డిసిపి ఆకాంక్ష్ యాదవ్, భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, డిసిసి అధ్యక్షులు సంజీవరెడ్డి, మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు,ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు .

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top