పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే
NTODAY NEWS:- ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్
పైడూరుపాడులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన, సీసీ రహదారుల పారంభోత్సవాలకు పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు. విజయవాడ రూరల్ మండలం పైడూరుపాడులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాదు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా భూమిపూజ చేశారు. దీని నిర్మాణానికి డి.ఎం.ఎఫ్ నిధుల నుంచి రూ.25 లక్షలు మంజూరయ్యాయి. ముందుగా గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.42.80 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రహదారులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మైలవరం నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజల సామాజిక అవసరాలు,బహిరంగ ప్రయోజనాల కోసం ఇక్కడ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాదుకి గ్రామస్తులు, కూటమి కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

