సంవత్సర కాలం గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని నాగినేనిపల్లి గ్రామపంచాయతీ నూతన భవనం.
NTODAY NEWS: బొమ్మలరామారం, జూన్ 04
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి గ్రామంలో సుమారు 30 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణమై సంవత్సరం అవుతున్న నేటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం అధికారుల అలసత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం, ప్రజాధనం వృధా అవుతున్న పట్టించుకోని అధికారులు జిల్లాలో నూతన గ్రామ పంచాయతీలు లేక పాతబడిన గ్రామపంచాయతీ భవనాలల్లో నిధులు నిర్వహిస్తున్న స్పెషల్ ఆఫీసర్లు, గ్రామపంచాయతీ కార్యదర్శులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణం అయి సంవత్సరం అవుతున్న వాడుకలోకి తీసుకురాకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నూతన గ్రామపంచాయతీ భవనం వాడుకలోకి తీసుకురాక పోవడం గల కారణం రాజకీయ నాయకుల నిర్లక్ష్య వైఖరికి కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకొని నూతన గ్రామపంచాయతీని ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు