విమోచన దినోత్సవం సందర్బంగా బీజేపీ గడ్డిఅన్నారం కార్యకర్తలతో జాతీయ జెండా ఆవిష్కరించిన – బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి.
NTODAY NEWS: ఎల్బీనగర్
బీజేపీ గడ్డిఅన్నారం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ బస్టాప్ వద్ద ఘనంగా జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు దాసరి జయ ప్రకాష్, బీజేపీ సీనియర్ నాయకులు ఆనంద్, మురళి, శ్రీధర్ రెడ్డి, శ్రవణ్, రాజేశ్వరి, సుజాత, ఒట్టే రాజు, బీష్మ చారీ, బాబు చౌదరి, రత్నం, లక్ష్మి, శిరీష, పద్మజ, శివ రామ్, మణిదీప్, వినయ్, టీంకు, రాము మరియు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.













