కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ప్రతిరోజు ప్రమాదాలు, పట్టించుకోని అధికారులు—దాసరి పాండు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
NTODAY NEWS: బొమ్మలరామారం
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం చీకటిమామిడి నుండి వనపర్తి వరకు రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేయకపోవడం వలన ప్రతి రోజు ప్రమాదాలకు ప్రజలు గురవుతున్నారని వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు అన్నారు.
మంగళవారం రోజున సిపిఎం పార్టీ మర్యాల గ్రామ శాఖ ఆధ్వర్యంలో చీకటి మామిడి నుండి వడపర్తి వరకు జరుగుతున్న రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ మర్యాల గ్రామ పరిధిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల రోడ్డు పనులకు కాలయాపన జరుగుతుందని అని అన్నారు పనులు మొదలు పెట్టి సంవత్సరం కావస్తున్న పనులు పూర్తి చేయడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉన్నదని అని అన్నారు దీనివలన ప్రతిరోజు ప్రజల అవసరాల నిమిత్తం భువనగిరి పట్టణానికి మరియు మండల కేంద్రం అయిన బొమ్మలరామారం, చీకటిమామిడి గ్రామాలకు వెళ్తున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అని అన్నారు రోడ్డులో కంకర మట్టి వెడల్పు చేయకపోవడం వేసిన కంకర మట్టిని రోడ్డు రోలర్ తో తొక్కించకపోవడంతో ఎక్కడికక్కడే ఉండడం వల్ల ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి అనేకమంది కింద పడుతూ ప్రమాదాలకు గురవుతున్నారు అని అన్నారు వాహనదారులు, ప్రయాణికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు అని అన్నారు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడంలేదని అన్నారు నత్త నడకన పనులు నడుస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి రోడ్డు పనులను పూర్తి చేయడంలో పట్టించుకోవడంలేదని అన్నారు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ ఫై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని,వెంటనే రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని లేని పక్షంలో గ్రామాల ప్రజలను సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం నాయకులు మధు, వెంకటేశం, సత్యనారాయణ, దేవేందర్, teలచ్చ నాయక్, మంగ, ఎల్లమ్మ,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

