నూతన గ్రామపంచాయతీ రెవెన్యూ హద్దులను ఏర్పాటు చేయాలి– కోడిమల శ్యాంసుందర్
NTODAY NEWS: బొమ్మలరామారం మండలం యాదాద్రి భువనగిరి జిల్లా,
బొమ్మలరామారం మండలంలో నూతనంగా ఏర్పడిన కాజీపేట గ్రామపంచాయతీకి సంబంధించిన హద్దులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం రోజున నిర్వహించే ప్రజావాణిలో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ కోడిమల శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాజీపేట గ్రామస్తులు జిల్లా కలెక్టర్ హనుమంతురావుకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ నూతన గ్రామ పంచాయతీగా కాజీపేట గ్రామం ఏర్పడడం ఎంతో సంతోషంగా ఉందని అని అన్నారు గ్రామ ప్రజల తరపు నుండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కాజీపేట నూతన గ్రామపంచాయతీ ఏర్పాటు చేసినప్పటి నుండి గ్రామపంచాయతీ రెవెన్యూ సర్వేనెంబర్ లకు సంబంధించి హద్దులు ఏర్పాటు చేయాలని గ్రామ కంఠం భూమి హద్దురాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో రామిడి సంజీవరెడ్డి, బాసారం లక్ష్మయ్య, పల్లెపాటి నారాయణ,రాంపల్లి కిరణ్, రామిడి గణేష్ రెడ్డి, కోడిమాల పాపిరెడ్డి, కోడిమాల శ్రీవర్ధన్ రెడ్డి, వంశీ, బాసారం రాజు తదితరులు పాల్గొన్నారు.













