ఆప్టిమస్ కంపెనీ సౌజన్యంతో కంచల్ తండ గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్
NTODAY NEWS: బొమ్మలరామారం.
ఆప్టిమస్ కంపెనీ సౌజన్యంతో బొమ్మలరామారం మండలం, కంచల్ తండ గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం దిశగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందన్నారు ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అని అన్నారు అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు నూతనంగా మంజూరైన తేజావత్ శాంతాబాయి ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మరియు మర్యాల గ్రామ శాఖ అధ్యక్షుడు ఈదులకంటి రాజిరెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఆప్టిమస్ కంపెనీ హెచ్ఆర్ దేవేందర్ రెడ్డిని గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి, భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైసు రాజేష్ పైలెట్, మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు సింగిర్తి మల్లేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ రాములు నాయక్ మాజీ జెడ్పిటిసి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీలు శ్రీహరి నాయక్, ఎర్వ హేమంత్ రెడ్డి, మైలారం ఈశ్వర్, మాజీ సర్పంచులు వట్టిపల్లి సుదర్శన్, యంజాల కల, దిరావత్ లక్ష్మణ్ నాయక్, మోటే గట్టయ్య, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత నాయక్, దేవస్థాన కమిటీ చైర్మన్ పండుగ రాజు, డైరెక్టర్లు శ్రీను నాయక్, మొకు మధుసూదన్ రెడ్డి, జిల్లా ఆదివాసి సెక్రెటరీ రాజు నాయక్, సీనియర్ నాయకులు మర్రి భగవంతు రెడ్డి, బేతాళ శ్రీనివాసులు,వెంకటేష్ నాయక్, శంకర్ నాయక్,వాలు నాయక్, శ్రీను నాయక్, శ్రీను నాయక్, తదితరులు పాల్గొన్నారు.













