ట్రేడ్ లైసెన్స్ లేని వ్యాపారస్తులకు నోటీసులు
నల్గొండ జిల్ల చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం రోజున 100 రోజుల ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో పెద్ద మోరీలలోని వ్యర్ధాలను తొలగించే కార్యక్రమం నిర్వహించారు. అంతేకాకుండా వివిధ వార్డుల్లో తడి , పొడి చెత్త ఎలా వేరు చెయ్యాలో వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపాలిటీ పరిధిలోని వ్యాపార సముదాయాలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. ట్రేడ్ లైసెన్స్ లేని పలు దుకాణాలకు నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను , శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రవణ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.