భారీ వర్షాల నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి — బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ బుగ్గ శ్రీశైలం
NTODAY NEWS: బొమ్మలరామారం
వాతావరణ శాఖ హెచ్చరికలు, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బొమ్మలరామారం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ బుగ్గ శ్రీశైలం మండల ప్రజలకు సూచించారు భారీ వర్షాల కారణంగా పాడు పడ్డ లేదా పగుళ్లు ఉన్న ఇళ్లలో ఉండకూడదు అని అన్నారు అత్యవసర పరిస్థితులు తప్ప బయటికి వెళ్లరాదని అన్నారు వర్షాల వలన తడిసిన కరెంట్ స్థంబాలను ముట్టుకోవద్దని, తెగిన వైర్లు దగ్గరికి వెళ్లకూడదు అని అన్నారు విద్యుత్ కరెంటు ద్వారా ప్రాణ నష్టం ఏర్పడుతుందని అని అన్నారు వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు భారీ వర్షాల వలన నీరు ప్రవహిస్తున్న వాగులు, వంతెనలు,నదుల దగ్గర వాహనాలు తీసుకెళ్తూ దాటకూడదు అని అన్నారు వర్షపు నీరు ఎక్కువగా చేరిన ప్రాంతాల్లో నడవకూడదు అని మండల ప్రజలను హెచ్చరించారు చిన్నారులు, వృద్ధులు,గర్భిణీలు బయటకు వెళ్లకుండా చూడాలి అని అన్నారు తాగునీటిని మరిగించి మాత్రమే ఉపయోగించాలి అని అన్నారు ప్రజలు రక్షిత ప్రదేశాల్లో ఉండి,తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అత్యవసర పరిస్థితులు ఏర్పడితే కలెక్టర్ కంట్రోల్ రూమ్ నెంబర్ కు 08685-293312 కాని పోలీస్ స్టేషన్ 8712662474 కు సమాచారం ఇవ్వాలని అన్నారు.













