మొంథా తుఫాన్ నేపథ్యంలో మండల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి– మండల తాహాసిల్దార్ పి. శ్రీనివాసరావు
NTODAY NEWS: బొమ్మలరామారం
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం వాతావరణ శాఖ హెచ్చరికలు, మొంథా తుఫాన్ కారణంగా రానున్న 72 గంటలు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండల ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని బొమ్మలరామారం మండల తహసిల్దార్ పి. శ్రీనివాసరావు మండల ప్రజలకు సూచించారు పాడు పడ్డ లేదా పగుళ్లు ఉన్న ఇళ్లలో ఉండకూడదు అని అన్నారు అత్యవసర పరిస్థితులు తప్ప బయటికి వెళ్లరాదని, వర్షాల వలన తడిసిన కరెంట్ స్థంబాలను ముట్టుకోవద్దని, తెగిన వైర్లు దగ్గరికి వెళ్లకూడదు అని అన్నారు భారీ వర్షాల వలన నీరు ప్రవహిస్తున్న వాగులు, వంతెనలు, నదులు దాటకూడదు అని అన్నారు వర్షపు నీరు ఎక్కువగా చేరిన ప్రాంతాల్లో నడవకూడదు అని, చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు బయటకు వెళ్లకుండా చూడాలి అని అన్నారు తాగునీటిని మరిగించి మాత్రమే ఉపయోగించాలి. ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండి, తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అత్యవసర పరిస్థితులు ఏర్పడితే కంట్రోల్ రూమ్ నెంబర్ కు 08685-293312 కాని మండల కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని తెలిపారు.

