ఏలూరుని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక
నగరాన్ని స్వచ్ఛ ఏలూరు గా తీర్చిదిద్దేందుకు ముందస్తు ప్రణాళికతో వెళ్తున్నామని. రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని శానిటేషన్ పనులకు ఆటంకం కలగకూడదని నూతన ట్రాక్టర్లు కొనుగోలు చేశామని శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి),నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు 54 లక్షల రూపాయలతో నూతనంగా కొనుగోలు చేసిన 9 ట్రాక్టర్లను ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి),నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మంగళవారం జండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ నగర పాలక సంస్థలో చాలావరకు ట్రాక్టర్లు రిపేర్లకువచ్చి శిధిలవస్థకు చేరాయి అన్నారు.రాబోయే వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని 9 కొత్త ట్రాక్టర్లు కొనుగోలు చేశామన్నారు.3 ట్రాక్టర్లు మంచినీటి సరఫరాకు,6 ట్రాక్టర్లు శానిటేషన్ పనులకు ఉపయోగిస్తారన్నారు. శానిటేషన్ విషయంలో ప్రజల నుండి ఒక్క కంప్లైంటు రాకూడదుఅన్నారు.
ఇప్పటికే శానిటేషన్ ఇన్స్పెక్టర్లు,మేస్త్రిలు సచివాలయ సెక్రెటరీలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి శానిటేషన్ పనుల విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించామన్నారు.
మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ ఏలూరు నగరాన్ని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దే చర్యలో భాగంగా.శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య సహకారంతో ఏలూరు నగర పాలక సంస్థలో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామన్నారు. 6 నెలలుకాలంలో మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన 15 వ ఆర్థిక సంఘం నిధులు సుమారుగా 3 కోట్ల రూపాయలతో మిని కాంపాక్టర్,ట్రాక్టర్లు,డంపర్ బీన్స్,పుష్కర్ట్స్, మొదలగునవి కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ట్రాక్టర్లు తిరగని ఇరుకు రోడ్లలో చెత్తను సేకరించడానికి 25 క్లాప్ వెహికల్స్ ఉపయోగిస్తున్నామన్నారు. ప్రజలుకూడా చెత్త రోడ్లమీద వేయకుండా డోర్ కలెక్షన్ కు వచ్చిన సిబ్బందికి అందించాలన్నారు.ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన, ఎంతమంది సిబ్బంది పని చేసిన,ప్రజలు,దుకాణదారులు సహకారం లేకపోతే ఏలూరు నగరం పరిశుభ్రంగా తయారు చేయలేమన్నారు.ప్రజలు దుకాణదారులు అందరూ గమనించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని మేయర్ నూర్జహాన్ పెదబాబు నగర ప్రజలను కోరారు. కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ లో పోగుబడిన చెత్త కూడా త్వరలో క్లియర్ చేస్తామన్నారు.హరితాంధ్ర ప్రోగ్రాం లో భాగంగా ఏలూరు నగరంలో 10 వేల మొక్కలు నాటుతున్నామన్నారు.డంపింగ్ యార్డ్ చుట్టూ మొక్కలు నాటి పొల్యూషన్ను అరికడతామన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గా భవాని శ్రీనివాస్,కో-ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం,అదనపు కమిషనర్ జి.చంద్రయ్య, ఎం.ఈ సురేంద్రబాబు, డి.ఈ రజాక్, ఏ.ఈ సాయి, కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు, దేవరకొండ శ్రీనివాసరావు, బత్తిన విజయకుమార్, కల్వకొల్లు సాంబ, పాము శామ్యూల్, ఉచ్చుల సుజాత సన్నీ, పలువురు శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.