www.ntodaynews.com
చందుర్తి గ్రామంలో పోలీసు వారి సందర్శన.
తెలంగాణ
చందుర్తి గ్రామంలో పోలీసు వారి సందర్శన.
NTODAY NEWS: గొల్లప్రోలు మండలం ప్రతినిధి. బోర శివారెడ్డి.
గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామం లో పిఠాపురం C I . శ్రీనివాస్, ఎస్సై. N రామకృష్ణ ప్రజలతో మీటింగ్ నిర్వహించారు. ప్రజలతో మాట్లాడుతూ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేయవద్దని తెలియజేశారు. ఎవరైనా సరే పశువధ, అక్రమ గ్రావెల్ తవ్వకాలు, జూదాలు, గంజాయి,లాంటి అసాంఘిక కార్యకలాపాల కి పాల్పడితే. కఠిన చర్యలు ఉంటాయని తెలియ పరిచారు.మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో యువకులు బాగా గంజాయి కి బానిసలు అవుతున్నారని, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా , ఉండాలని తెలియపరిచారు.యువకులు బైక్స్ మీద బయటకు వెళ్ళినప్పుడు బైక్ స్టంట్స్ వేయడం, బైక్స్ మీద అతివేగంగా వెళ్లడం మానుకోవాలని , అలా వెళితే ప్రమాదాలు జరుగుతాయని తర్వాత ఏమైనా మీ భవిష్యత్తు పాడవుతుందని. అక్కడ ఉన్న యువకులకు అర్థమయ్యేలా తెలియజేశారు. రేపొద్దున్న చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని , ఉన్నంత స్థాయికి ఎదుగుతారని తెలియజేశారు.అక్కడ ఉన్న యువకులకు ఇలాంటి అలవాట్లకు గాని మత్తు వ్యసనాలకు, దూరంగా ఉండమని సీఐ శ్రీనివాస్, N రామకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం సీఐ. శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్సై N . రామకృష్ణ,p.c అంబిరాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube