ఇంటి స్థలాలు ఇవ్వాలని భువనగిరి పట్టణంలో పేదల పాదయాత్ర, కలెక్టరేట్ ముట్టడి,
ఇంటి స్థలాలు ఇచ్చే వరకు భూ పోరాటం ఆగదు— సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ జహంగీర్
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా
పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చే వరకు భూపోరాటం ఆగదని వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు యండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజున భువనగిరి పట్టణంలో ఇంటి స్థలాలు లేని పేదలు సిపిఐ(ఎం) భువనగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గుడిసె వాసులతో సిపిఎం జిల్లా కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు భారీ పాదయాత్ర నిర్వహించి కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. పాదయాత్ర పొడువునా ఇంటి స్థలాలు ఇవ్వాలని, పట్టాలు ఇచ్చిన 700 సర్వే నంబర్ లో ఇంటి స్థలాలు కేటాయించాలని నినాదాలు చేస్తూ పాదయాత్ర నిర్వహించారు అనంతరం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ అధ్యక్షతన జరిగిన కలెక్టరేట్ ముట్టడిలో ముఖ్య అతిథిగా హాజరైన సిపియం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి ఎండి జాంగిర్ మాట్లాడుతూ భువనగిరి పట్టణంలోని ముగ్ధుంపల్లి రోడ్ లో గల 700 సర్వే నంబర్ లో 2005లో 105 మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి నేటికి 20 సంవత్సరాలు గడుస్తున్న ఇంత వరకు స్థలాలు కేటాయించక పోవడం పేదల పట్ల ప్రభుత్వాల చిన్న చూపు అర్ధం అవుతుందని విమర్శించారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా పరిష్కరిస్తుందని ఆశగా ఎదురుచూసిన ప్రజలు నిరాశకు గురై ఉండడానికి గూడులేక గుడిసెలు వేస్తే వాటిని కూల్చి తగలబెట్టడం ప్రభుత్వ దుర్మార్గమైన చర్య అని వెంటనే పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ నెల 20వ తేదీవరకు వేచి చూసి అనంతరం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేశారు.
సిపిఐ ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు అని అధికారులు, పోలీసులు నిరుపేదల ఎడల వ్యవహరిస్తున్న వైఖరి సరిగా లేదని గత బిఆర్ఎస్ ప్రభుత్వం వైఖరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పట్ల వ్యవహరిస్తుందని విమర్శించారు. కలెక్టర్ రావాలి అని నినాదాలు చేయడంతో పోలీసులు జోక్యం చేసుకొని నాయకత్వాన్ని రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఛాంబర్ కి తీసుకెళ్లడం జరిగింది. సమస్యను తెలియజేస్తూ అదనపు కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 700 సర్వే లో ప్రభుత్వ భూమిని వెంటనే సర్వే నిర్వహించి పేదలందరికీ వచ్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడంతో ముట్టడిని విరమించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపియం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, దాసరి పాండు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గంధమల్ల మాతయ్య, కల్లూరి నాగమణి, పట్టణ నాయకులు బర్ల వెంకటేష్, వల్దాసు అంజయ్య, కొత్త లక్ష్మయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, రజక సంఘం జిల్లా కార్యదర్శి వడ్డేమాన వెంకటేష్ పట్టణ నాయకులు ఈర్లపల్లి రాహుల్, నరాల నరసింహ, వల్దాసు జంగమ్మ, కొత్త లలిత, అర్బన్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, ఎండి రియాజ్, ఎండి సాజిద్, భూ పోరాట కమిటీ కన్వీనర్ దొడ్డి శంకర్, ఇక్కుర్తి సుజాత, ఇక్కుర్తి కళావతి, పోలిశెట్టి మంజుల, కన్నెబోయినా అరుణ, నారకాలమ్మ, అండ బోయిన కృష్ణవేణి, నాగమణి, వరలక్ష్మి, బై శెట్టి మంజుల, సత్తెమ్మ, రంగపురం స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.

