ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి
••3కోట్ల50లక్షల కేంద్ర ప్రభుత్వం తరుపున నిధులు విడుదల.
••కృతజ్ఞత తెలియజేస్తూ నర్సాపూర్ నియోజకవర్గ బీజేపీ నాయకుల భారీ ర్యాలీ
నర్సాపూర్, సోమవారం నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన బీజేపీ నియోజకవర్గ నాయకులు నియోజకవర్గంలోని నాగులాపల్లి గ్రామ బంజారానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణానికి 3కోట్ల 50లక్షల రూపాయలను కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రదన్ విడుదల చెయ్యగ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మెదక్ ఎంపీ రఘనందన్ రావు కేంద్ర మంత్రి దర్మేంద్ర ప్రదన్ కీ కృతజ్ఞతలు తెలియజేస్తూ భారీ ర్యాలీ నిర్వహించి. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎంపీ రఘనందన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలొ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ నర్సాపూర్ మున్సిపల్ చేర్మెన్ మురళి యాదవ్, జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ఓ, బీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి చిన్న రమేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోడ రాజేందర్ మరియు నర్సాపూర్ మండల పార్టీ అధ్యక్షులు నగేష్.. శివంపేట కొల్చారం, హత్నూర మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
End

