రజక వృత్తిదారులకు రక్షణ కల్పించాలి
NTODAY NEWS: చిట్యాల
రజక వృత్తిదారుల రక్షణ కల్పించి వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం చిట్యాల పట్టణ కేంద్రంలో నిర్వహించిన రజక వృత్తిదారుల సంక్షేమ సంఘం మండల మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో రజక వృత్తిదారుల పై నిత్యం జరుగుతున్న సామాజిక దాడులను నివారించడంలో పాలక ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని అందువల్లే నిత్యం రజక, నాయి బ్రాహ్మణ వంటి వృత్తిదారులపై సామాజిక దాడులు దౌర్జన్యాలు పెరుగుతున్నాయని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఆవనగంటి స్వామి, రుద్రారం పెద్దులు, అమనగట్టి నరేష్, అక్కెనపల్లి నాగయ్య, ఐతరాజు నరసింహ, అర్జున్, గోలి మహేష్, మాజీ ఎంపీటీసీ ఎద్దులపురి కృష్ణ, దామనూరి కనకయ్య, ఐతరాజు మాధవి, సైదులు, అమరోజు రాములు, బాతరాజు జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

