హైదరాబాద్ అక్టోబర్ 2 : Ntodaynews: ప్రతినిధి.
ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ జిల్లా కమిటీలో మార్పులు, చేర్పులు చేసుకోవడం జరిగింది. అక్టోబర్ 2న విద్యానగర్, సిపి భవన్లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో POW గతంలో జరిగిన కార్యక్రమాలను సమీక్షించి భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించుకోవడం జరిగింది. స్త్రీలపై, బాలికలపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు, అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని, స్త్రీ పురుష సమానత్వం కై పోరాడాలని, పనిచేసే చోట మహిళలకు హక్కుల కల్పించాలని, స్త్రీ పురుషులు ఇద్దరికీ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, స్త్రీలను కేవలం ఒక ఆట బొమ్మలుగా, లైంగిక వస్తువులుగా చూసే సామ్రాజ్యవాద పాశ్చాత్య పోకడలను ఎండగట్టాలని, వరకట్న వేధింపులకు, ప్రేమ పేరుతో జరిగే వేధింపులకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ పోరాటాలను నిర్మించే క్రమంలోని ఈరోజు జరిగిన ఈ సమావేశం లో కమిటీ లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. నూతన అధ్యక్షురాలుగా కోలా స్వప్న, ప్రధాన కార్యదర్శిగా భారతి లను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది…ఈ సమావేశం లో POW జిల్లా నాయకులు పద్మ, వజ్రమని, జయసుధ, కుమారి, రేణుక, సరిత, ఫాతిమా, మాణిమాల మొదలైనవారు పాల్గొన్నారు.