అండర్ పాస్ నిర్మించే ప్రదేశాన్ని పరిశీలించిన ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రవీణ్ , చిట్యాల బిజెపి నాయకులు
NTODAY NEWS: స్టాఫ్ రిపోర్టర్ కూనూరు మధు
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్. నిర్మాణ పనులను ప్రాజెక్టు ఇంజనీర్ ప్రవీణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఇంజనీర్ మాట్లాడుతూ చిట్యాలలో ప్రజల సౌకర్యం కోసం బస్టాండ్ దగ్గర ఒక అండర్ పాస్ పనులు ప్రారంభించామని నాలుగైదు రోజుల్లో రెండవ దశ పనులు ప్రారంభిస్తామని అన్నారు వీటితోపాటు రెండవ అండర్ పాస్ పనులు చిట్యాల ప్రభుత్వ పాఠశాల వద్ద నిర్మించే ప్రదేశాన్ని పరిశీలించారు . వీరితోపాటు చిట్యాల బిజెపి రాష్ట్రం ఎస్సీ మోర్చా కార్యదర్శి మాస శ్రీనివాస్, చిట్యాల మాజీ ప్రధాన కార్యదర్శి జారుకు రామకృష్ణ, చిట్యాల పట్టణ నాయకులు కందాటి చంద్రారెడ్డి, అమరోజు కిట్టు, పాల్గొన్నారు.