ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని శాసన పరిషత్ చైర్మన్ కు వినతి
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, జూన్ 2
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరులైన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని “తెలంగాణ అమర వీరుల కుటుంబాల కమిటీ ” యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ బర్రె సుదర్శన్, కో- కన్వీనర్ కొడారి వెంకటేష్ లు కోరారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలైన ప్రతి అమరవీరుల కుటుంబానికి 25 వేల రూపాయల పెన్షన్, 250 గజాల ఇంటి స్థలాలు ఇవ్వాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లతో అమరవీరుల కుటుంబాల సభ్యులు కలిసి మాట్లాడే అవకాశం కల్పించాలని వారు తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ని కోరారు. రాష్ట్ర శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ సానుకూలంగా స్పందించి, రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెల్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.వినతి పత్రం ఇచ్చిన వారిలో అమరవీరుల కుటుంబాల సభ్యులు కోట్యా నాయక్,జ్యోత్స్న ,రవి,లలిత, శిరీష,స్వాతి,వాసవి,కృష్ణవేణి, తదితరులు ఉన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube