ప్రజా సమస్యలు పరిష్కరించాలి

Spread the love

ప్రజా సమస్యలు పరిష్కరించాలి– సిపిఎం మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్

NTODAY NEWS: తుర్కపల్లి

శనివారం రోజున సిపిఎం పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో తుర్కపల్లి గ్రామంలోని ప్రజా సమస్యలు పరిష్కరించాలని తుర్కపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి శైలజకి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా తుర్కపల్లి సిపిఎం మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ మాట్లాడుతూ 6,వార్డు 7వార్డులలో గత 20 సంవత్సరాల నుండి ప్రభుత్వాలు మారుతూ వస్తున్నప్పటికీ ఈ వార్డులలో సమస్యలు పట్టించుకునే అధికారులు నాయకులు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఆరో వార్డు, ఏడవ వార్డులలో ఎస్సీ, బీసీ కాలనీలలో కొన్నిచోట్ల సీసీ రోడ్లు వేసి మోరీలను మరిచారు ప్రతి ఇండ్లలోని నీరు రోడ్ల మీదికి వదలడం వల్ల వంపుగా ఉన్న ఇండ్లలోకి ఆ నీరు అంతా వచ్చి చేరుతుందని రోడ్లమీద నిలువ ఉండి క్రిమి కీటకాలతోటి సీజనల్ వ్యాధులు బారిన పడుతున్నారని అన్నారు డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నాలుగు వైపుల నుండి డ్రైనేజీ వాటర్ ఒకే చోట చేరి చెరువుకుంటల తలపిస్తుందని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధ పాతిపదికన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి కాలనీ ప్రజల బాధలను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కొక్కొండ లింగయ్య,గడ్డమీది నరసింహ, తలారి మాతయ్య,ఆవుల కలమ్మ,కోట నాగరాజు,భూక్య, లక్ష్మి కాలనీవాసులు సుశీల,లక్ష్మి, పోచమ్మ,మాధవి,లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »