నిలోఫర్, ఎంఎన్‌జే ఆసుపత్రుల వద్ద ‘రెడీ టూ సర్వ్’ ఫౌండేషన్ అన్నదానం
NTODAY NEWS: హైదరాబాద్.
స్వచ్ఛంద సంస్థ ‘రెడీ టూ సర్వ్’ ఫౌండేషన్ ఆదివారం లక్డీకపూల్‌లోని నిలోఫర్, ఎంఎన్‌జే ఆసుపత్రుల వద్ద అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆసుపత్రులకు వచ్చే రోగులు, బంధువులు, పేదలకు ఉచితంగా భోజనం అందజేసింది. ఆకలితో బాధపడుతున్న వందలాది పేదల పూట భోజనానికి తోడ్పడాలనే సంకల్పంతో సంస్థ నిరంతరంగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని సంస్థ నిర్వాహకుడు పెద్ది శంకర్ తెలిపారు. “ప్రతి వారం మా సేవ కార్యక్రమాలు సమాజానికి చేరువవుతున్నాయి. ఆకలిని తీర్చడం మా ప్రధాన లక్ష్యం” అని ఆయన అన్నారు. ఈ అన్నదానం కార్యక్రమంలో శివ చైతన్య, బి.టి. నాయుడు విజయభాస్కర్, నాగమోహన్, సతీష్ గౌడ్, చంద్రశేఖర్, డైసీ రిత్విక, చంద్ర, సైదులు, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.













