బద్దం ఎస్. సుభాషి రెడ్డి ఆరవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు
NTODAY NEWS: ఎల్బీనగర్
గడ్డిఅన్నారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్, స్వర్గీయ బద్దం ఎస్. సుభాష్ రెడ్డి 6వ వర్ధంతిని పురస్కరించుకొని, బీజేపీ గడ్డిఅన్నారం డివిజన్ అధ్యక్షులు దాసరి జయప్రకాష్ ఆధ్వర్యంలో బాలాజీ స్వీట్ హౌస్, P&T కాలనీ చౌరస్తా వద్ద వర్ధంతి కార్యక్రమం శ్రద్ధాంజలులతో జరుపుకొన్నారు. స్థానిక ప్రజలు, అభిమానులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సుభాష్ రెడ్డి సేవలను స్మరించుకున్నారు. సుభాష్ రెడ్డి 6వ వర్ధంతిని పురస్కరించుకొని గడ్డిఅన్నారం డివిజన్ జిహెచ్ఎంసి పారిశుభ్ర సిబ్బంది, ఎంటామాలజీ సిబ్బంది లకు చలి స్వెట్టర్లు మరియు గ్లౌజులు బిజెపి నాయకులు కార్యకర్తలు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ కార్పొరేటర్లు రంగా నర్సింహా గుప్తా, నాయికోటి పవన్, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు దాసరి మల్లేశం, చిలకూరి రామ్ రెడ్డి తదితరులు పాల్గొని, సుభాష్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ప్రజాసేవా పట్ల చూపిన అంకితభావాన్ని కృతజ్ఞతతో స్మరించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా మాట్లాడుతూ.. సుభాష్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రజల కోసమే పనిచేసిన నాయకుడు. పార్టీ బలోపేతం, కార్యకర్తల అభివృద్ధి, మున్సిపాలిటీ అభివృద్ధికి ఆయన చేసిన కృషి అమోఘం. వారు చూపించిన మార్గం నేటికీ మాకు స్ఫూర్తి అందిస్తోంది.. ఈ సందర్బంగా కార్పొరేటర్ నాయికోటి పవన్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో నాకు గురువు బద్దం సుభాష్ రెడ్డి . వారి లాంటి పరిపూర్ణ నాయకుడు అరుదు. మున్సిపాలిటీకి అత్యధిక నిధులను తెచ్చి చారిత్రక అభివృద్ధి సాధించిన నాయకుడు. వారి కలలను నిజం చేసేందుకు మేమంతా కట్టుబడి ఉన్నాము..
ఈ సందర్బంగా కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మా నాన్న వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం మనసును బాధ కలిగిస్తుంది. వారు లేక ఆరు సంవత్సరాలు అయినా, ప్రతి కాలనీలోకి వెళ్లినప్పుడు ‘మీ నాన్న మా ఇంటికి వచ్చి పలకరించేవారు’ అని ప్రజలు చెప్పడం చూస్తే వారు ప్రజల హృదయాల్లో ఎంత స్థానం సంపాదించుకున్నారో అర్ధమవుతోంది. నాన్న చైర్మన్‌గా ఉన్న సమయంలో సీసీ రోడ్లు, నాలా పనులు, డ్రైనేజీ పనులు, కాలనీ సౌకర్యాల అభివృద్ధి వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గడ్డిఅన్నారం ను అభివృద్ధి దిశగా నడిపించారు. వారి ఆశయాలను నెరవేర్చే దిశగా సేవ చేస్తున్నాను అని తెలిపారు. ఈ సందర్బంగా డివిజన్ అధ్యక్షులు దాసరి జయ ప్రకాష్ మాట్లాడుతూ.. సుభాష్ రెడ్డి .చేసిన సేవలు, వారు ప్రజలతో ఉన్న అనుబంధం, పార్టీపై చూపిన నిబద్ధత గురించి స్మరించి, వారు చూపిన మార్గంలో ముందుకు సాగేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఆనంద్ కుమార్, శ్రీధర్ రెడ్డి, నర్సింహా, శ్రీనివాస్, చిలకూరి జనార్దన్ రెడ్డి, సుందర్ నారాయణ, సుబ్బారెడ్డి, మురళి, నగేష్ నాయక్, సుజాత, శ్రీలక్ష్మి, రాజేశ్వరి, ధనరాజ్, సిరి, శిరీష, సందీప్, సతీష్, హనుమంత్ రెడ్డి, కృష్ణ, శ్రీనివాస్, అనిల్, లోకేష్, మహేష్, శ్రీకాంత్ నాయుడు, శరత్, వంశీ యాదవ్, సిద్దు, రఘునందన్ జోషి, టీంకు, శశాంక్, హరీష్, నాని మరియు తదితరులు పాల్గొన్నారు.













