కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా సాదుల ప్రవీణ్
N TODAY NEWS: బొమ్మలరామారం
యాదాద్రి భువనగిరి జిల్లా,ఆలేరు నియోజకవర్గం,బొమ్మలరామారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా సాదుల ప్రవీణ్ ను గురువారం రోజున బొమ్మలరామారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ బొమ్మలరామారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నాకు సహకరించిన ప్రభుత్వ విప్,ఆలేరు శాసనసభ్యులు బిర్ల ఐలన్నకి, భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైస్ రాజేష్ పైలెట్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించడం ఖాయమని అన్నారు పేదలకు ప్రభుత్వ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం అని అన్నారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సింగిర్తి మల్లేష్, బొమ్మలరామారం తాజా మాజీ సర్పంచ్ రాంపల్లి మహేష్ గౌడ్, మాజీ జెడ్పిటిసి మర్రి కృష్ణారెడ్డి, మాజీ ఎంపిటిసి మైలారం ఈదమ్మ యాదగిరి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్రి భగవంత రెడ్డి,బొమ్మలరామారం దేవస్థాన కమిటీ చైర్మన్ పండుగ రాజు,మాజీ ఉపసర్పంచ్ బేతాళ శ్రీనివాసులు,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మలబోయిన రఘు యాదవ్,సీనియర్ నాయకులకు,మండల నాయకులకు, కార్యకర్తలకు అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.













