జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 యూనిట్ మార్చ్ కార్యక్రమం

Spread the love

జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 యూనిట్ మార్చ్ కార్యక్రమం

NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి ని పురస్కరించుకొని ప్రజలలో జాతీయ సమైక్యతను దేశభక్తిని పెంపొందించేందుకుగాను,కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ మరియు ఎన్ఎస్ఎస్ సహకారంతో “సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 యూనిట్ మార్చ్” ను నిర్వహించనున్నట్లు ఎంపీ, రాజ్యసభ సభ్యులు భగవత్ కరద్ తెలిపారు.గురువారం వీడియో కాన్ఫరెన్స్ హల్ నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 యూనిటీ మార్చ్ కార్యక్రం అమలులో భాగంగా జిల్లాల అధికారులు,మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫెరెన్స్ లో మాట్లాడారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 యూనిటీ మార్చ్ కార్యక్రమంలో భాగంగా జాతీయ సమైక్యత,దేశభక్తిని పెంపొందించడం,ప్రత్యేకించి జాతిని ఏకీకృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర ,జాతి నిర్మాణంలో యువతను ప్రోత్సహించడం ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 31 నుండి నవంబర్ 25 వరకు జిల్లాలలో విడతలవారీగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని,సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 యూనిటీ మార్చ్ లో 3 రోజుల పాదయాత్రను జిల్లాస్థాయిలో నిర్వహించాలని, ప్రతి పాదయాత్ర 8 నుండి10 కిలోమీటర్లు ఉండేలా చూడాలని, ఈ పాదయాత్రలో కనీసం 500 మంది యువత, విద్యార్థులు పాల్గొనేలా చూడాలని ఆయన అధికారులతో కోరారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 యూనిటీ మార్చ్ నిర్వహించడంలో వల్లభాయ్ పటేల్ భాగంగా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అధికారులతో కోర్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని , అధికారులు, జిల్లా యువజన సర్వీస్అధికారి, ఇతర అధికారులు, ప్రతినిధులతో కో-ఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు.ఈ సందర్బంగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లడుతూ సర్దార్ 150 యూనిటీ మార్చ్ కార్యక్రమాలలో భాగంగా జిల్లా స్థాయిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితానికి సంబంధించి ప్రజలకు యువతకు తెలియజేయడం,కళాశాల, పాఠశాల విద్యార్థులకు డిబేట్, వ్యాసరచన చేపట్టాడం జరుగుతుందని ఆయన తెలిపారు.నవంబర్ 26 జాతీయ స్థాయ మహా ఐక్యతా పాదయాత్ర నిర్వహిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మస్థలమైన కరంసద్ (గుజరాత్) నుంచి ప్రారంభమై 152 కి.మీ. సాగి Statue of Unity వద్ద ముగియనుంనది. ఇవే 5 5 5 My Bharatportal (https://mybharat.gov.in/) ລ້ రచనా పోటీలు క్విజ్ పోటీలు,మొదలగు పోటీలు నిర్వహిస్తారు.యువతి యువకులు ఆన్ లైన్ లో పోటీలలోక పాల్గొనాలని తెలియజేశారు. జిల్లాల వారీగా రూట్ మ్యాప్ ను రూపొందించాలన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లాలో నవంబర్ 10వ తేదీలలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన జిల్లా యంత్రాంగాన్ని కోరారు.అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎంపీ, రాజ్యసభ సభ్యులు శ్రీ భగవత్ కరద్,కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో వచ్చే నెల 10 వ తేదిన సర్దార్ 150 యూనిట్ మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ ఆఫీసర్ గంటా రాజేష్, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ధనంజ నే యులు, ఇంటర్మీడియట్ విద్యాధికారి రమణి, జిల్లా పౌర సంబంధాల అధికారి అరుంధతి తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »