రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ మృతి
NTODAY NEWS: రిపోర్టర్ కూనూరు మధు
చిట్యాల మండల పరిధిలో ఉన్న వెలిమినేడు గ్రామ శివారులో కారు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 7 గంటల సమయంలో అస్సాం రాష్ట్రానికి చెందిన ఇండిస్ కంపెనీలో సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న జింటు దత్త (31) రోడ్డు వెంట నడుచుకుంటూ వెళుతుండగా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో NH-65 రోడ్డు పక్కన గల మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఎదురుగా వచ్చే సరికి, నార్కట్ పల్లి వైపు నుండి హైదరాబాద్ వైపు వెళుతున్న కారు డ్రైవరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ రోడ్డు వెంట నడుచుకుని వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టగా మృతుని తలకు బలమైన గాయాలు అయ్యి అక్కడికక్కడే మృతి చెందాడని, మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల ఎస్ఐ మామిడి రవి తెలియజేశారు.













