డీజిల్ దొంగతనం చేస్తున్న దొంగలను చాకచక్యంగా చేదించిన శంకరంపేట్ పోలీసులు

Spread the love

 డీజిల్ దొంగతనం చేస్తున్న దొంగలను చాకచక్యంగా చేదించిన శంకరంపేట్ పోలీసులు

NTODAY న్యూస్: లక్ష్మిప్రసాద్ మెదక్ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 30

★ చెడు అలవాట్లకు బానిసాలైన యూవకులు

★దొంగతనంకి అలవాటు పడిన నేరస్తలను జైలుకు పంపిన పోలీస్ లు

ఈనెల 29వ తేదీ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో శంకరంపేట్ ఎస్సై మరియు సిబ్బంది వాహన తనిఖీలు  చేస్తుండగా.. చీలపల్లి బ్రిడ్జి వద్ద ఒక బలెనో కార్ నెంబరు TS08FF 3047 గల కారును ఆపి తనిఖీ చేయగా అందులో 30 లీటర్ల ఖాళీ డబ్బాలు 6 ఉన్నాయని గుర్తించారు.కార్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వారి పేర్లు 1) సబవత్ రాహుల్ వనపర్తి జిల్లా  రెండో వ్యక్తి పేరు కురుమ గణేష్ కామారెడ్డి జిల్లా లింగంపేట్ మూడో వ్యక్తి తోకల నాగరాజు మహబూబ్నగర్ జిల్లా అడ్డకల్ మండల్ అని తెలిపినారు కారులో డబ్బాల గురించి విచారించగా వాళ్లు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారిని కారుతో సహా పిఎస్ కు కు తీసుకొచ్చి విచారించగా వారు తెలిపినది వివరాలు. వారందరూ హైదరాబాదులో కూకట్పల్లి ఏరియాలో నివాసం ఉంటున్నారని తెలిపరు ఆటో డ్రైవింగ్ చేస్తూ కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని తెలియజేసారు వాటి వల్ల వచ్చే డబ్బులు వారికి జల్సాలకు సరిపోవడం లేదని ఈజీగా డబ్బు సంపాదించడం కొరకు ఏదైనా దొంగతనం చేద్దామని ముగ్గురు కలిసి నిర్ణయించుకొని వారికి తెలిసిన బోరబండ కు చెందిన అన్వర్ అనే వ్యక్తి పరిచయంతో డీజిల్ దొంగతనం చేయడం ప్రారంభించినారు వీరు రోడ్డు పక్కన పార్క్ చేసిన లారీలలో డీజిల్ దొంగ దొంగలించి అన్వర్ అనే వ్యక్తికి బోరబండలో అమ్మి ఆ డబ్బులతో జల్సాలు చేయడం ప్రారంభించారు అదేవిధంగా తేదీ 22 10 2025 రోజు నిజాంపేటలో
TS 08FF 3047 నెంబరు గల బలేనో కారు అద్దెకు తీసుకొని ఔటర్ రింగ్ రోడ్ ఏరియాలో మరియు జోగిపేటలో లారీల నుండి డీజిల్ దొంగిలించి అన్వర్ కు అమ్మడం జరిగిందన్నారు తర్వాత 25 తేదీ రోజు నడిరాత్రి అదే కారు తీసుకొని శంకరంపేట వచ్చి శంకరంపేట చర్చి కాంపౌండ్ లోని జుగాల్పూర్ నారా గౌడ్ యొక్క టిప్పర్ల నుండి 6 డబ్బాలలో 150 లీటర్ల డీజిల్ ను గోదాం తాళం పగలగొట్టి లోపల ఉన్న ఒక పాత బ్యాటరీ లారీ జాక్ దొంగిలించి డీజిల్ను బోరబండలోని అన్వర్ కు అమ్మినాము అని బ్యాటరీ జాక్ తమ వద్ద ఉన్నాయని తెలిపినారు ఈ ముగ్గురు డీజిల్ దొంగలను
అరెస్ట్ చేసి  మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించడం జరుగుతుంది. నాలుగో నిందితుడు అన్వర్ పరారీలో  ఉన్నారని. ఉన్నారు పేర్కొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »