దుర్గాదేవి ఉత్సవాలు సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థాన్:- ఎస్ఐ జగన్ సూచించారు

Spread the love

ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్గా దేవి నిర్వాహకులకు ఎస్ఐ జగన్ మాట్లాడుతూ. కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాల వద్ద ఎల్లప్పుడూ నిర్వాహకులు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని, ఫైబర్ తో కూడిన మండపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అగ్నిప్రమాదాలు జరగకుండా దీపం వెలిగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అఖండ దీపం కోసం దీపం కింద బియ్యం తో పాటు ఇనుప రేకు తో కూడిన అడ్డును పెట్టడం ద్వారా ప్రమాదం జరగదని ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే మంటను ఆర్పే విధంగా డ్రమ్ముల్లో నీటిని, ఇసుకని మండపం వద్ద అందుబాటులో ఉంచాలని తెలిపారు. అదేవిధంగా శబ్ద కాలుష్యం నేపథ్యంలో డీజే పర్మిషన్లు లేవని మిక్సర్ తో కూడిన సౌండ్ ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతల మధ్య ఉత్సవాలు జరుపు కోవాలని ఆయన సూచించారు.