గాయత్రి హాస్పిటల్ పై ఎస్ఓటి పోలీసుల దాడి

Spread the love

గాయత్రి హాస్పిటల్ పై ఎస్ఓటి పోలీసుల దాడి,పోలీసుల అదుపులో వైద్యుడు

NTODAY NEWS:భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా,భువనగిరి పట్టణంలోని గాయత్రి ఆసుపత్రిపై ఎస్ఓటీ పోలీసులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు.ఈ దాడుల సమయంలో ఆసుపత్రిలో ఇద్దరు మహిళలకు అక్రమంగా అబార్షన్ చేస్తున్న డాక్టర్ ను ఎస్ఓటి పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా డాక్టర్ శివకుమార్ ను పోలీసులు గుర్తించారు లింగ నిర్ధారణ చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ ను అదుపులోకి తీసుకున్నారు డాక్టర్ శివను ల్యాబ్ టెక్నీషియన్ ను భువనగిరి టౌన్ పోలీసులు అదుపులోని తీసుకొని విచారణ చేపట్టారు డాక్టర్ శివకుమార్ అరెస్ట్ అవ్వడం ఇది మొదటి సారి కాదు.2022లో ఆలేరులో ఓ బాలికకు అక్రమ అబార్షన్ నిర్వహించిన సమయంలో కూడా డాక్టర్ శివను పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. అప్పట్లో అతను నిర్వహిస్తున్న ‘స్వాతి హాస్పిటల్’ను వైద్యాధికారులు సీజ్ చేశారు. అనంతరం డాక్టర్ శివకుమార్ హాస్పిటల్ పేరు మార్చి, గాయత్రి ఆసుపత్రిగా మళ్లీ ప్రారంభించాడు.  ప్రస్తుతం ఆయన ప్రతి అబార్షన్ కు వేల రూపాయలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికైనా జిల్లా డిఎంహెచ్వో హాస్పిటల్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »