వేలంలో లడ్డును దక్కించుకున్న విద్యార్థులు

Spread the love

వేలంలో లడ్డును దక్కించుకున్న విద్యార్థులు

NTODAY NEWS: హైదరాబాద్.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గణపతి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు ఘనమైన పూజలు అందుకున్న గణనాథులు తన తల్లి గంగమ్మ ఒడిలోకి చేరారు. గణనాథుని చేతిలో నవరాత్రులు పూజలు అందుకున్న లడ్డూకు వేలంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ మహా ప్రసాదాన్ని సొంతం చేసుకుంటే తమకు శుభం కలుగుతుందని, భోగభాగ్యాలు దక్కుతాయని భక్తులు భావిస్తారు. దీంతో ఎంతైనా వెచ్చించి వేలంలో దక్కించుకోవడానికి సిద్ధపడుతారు. హైదరాబాద్ జిల్లా కేంద్రంలోని బాగ్ లింగంపల్లి లంబాడీ తండాలో బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శనివారం నిమజ్జనోత్సవం సందర్భంగా లడ్డును వేలం పాటను నిర్వహించారు. నవరాత్రులు పూజలు అందుకున్న లంబాడీ తండా విఘ్నేశ్వరుడికి శనివారం రాత్రి 9 గంటలకు చివరి పూజ నిర్వహించిన అనంతరం వేలం పాటను మొదలు పెట్టారు. ఈ వేలం పాటలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. హోరా హోరీగా సాగిన వేలం పాటలో వడిత్య అంజలి -కళ్యాణ్ నాయక్ దంపతుల కుమారులు వడిత్య మధు కపిల్ & సిద్దు కపిల్ దాదాపు ఒక లక్ష రూపాయల వరకు వేలం పాడి స్వామి గణేష్ మహరాజ్ లడ్డూను సొంతం చేసుకున్నారు. అనంతరం మేళా తాళల మధ్య నృత్యాలతో గణేష్ మహరాజ్ విగ్రహన్నీ  నిమార్జనం చెయ్యడానికి కదిపారు.. ఈ సందర్భంగా గణేష్ లడ్డు గ్రహీతలు మాట్లాడుతూ వేలంలో లడ్డూ సొంతం చేసుకున్నందుకు తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. దీనంతటికి కారణం తమ తల్లిదండ్రులు ప్రేమాభిమానాలు అని వారు తమను అన్ని విషయాల్లో ప్రోత్సహిస్తున్న తీరు పట్ల కృతజ్ఞతలు తెలిపారు. దైవసేవతో పాటు సమాజ సేవ చాలా అవసరం అని నిత్యం బోధిస్తుంటారన్నారు. పాఠశాల విద్యను అభ్యస్తున్న తమ కుమారులు హిందుమతం పట్ల చూపిస్తున్న ఆసక్తి కి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు, స్థానికులు కూడా ఆనందం వ్యక్తం చేశారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »