జిల్లా ఉత్తమ పర్యవేక్షకులుగా ప్రశంస పత్రం అందుకున్న బొమ్మలరామారం ఎంపీడీవో కార్యాలయ పర్యవేక్షకులు గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి
NTODAY NEWS: బొమ్మలరామారం
ఆగస్టు15, 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు గుర్తింపుగా జారీ చేసే ప్రశంసా పత్రంలో భాగంగా బొమ్మలరామారం మండల ప్రజా పరిషత్ పర్యవేక్షకులు గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డికి జిల్లా ఉత్తమ పర్యవేక్షకులు గా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు చేతుల మీదుగా ఉత్తమ ప్రశంసా పత్రం అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అధికారులకు, మండలాధికారులకు, మండల ఎంపీడీవో కార్యాలయ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ప్రశంసా పత్రం అందుకున్నప్పుడు చిత్రంలో ఉన్న డిసిపి ఆకాంక్ష్ యాదవ్, భువనగిరి ఏసిపి రాహుల్ రెడ్డి, అడషనల్ కలెక్టర్ వీరారెడ్డి, యాదాద్రి భువనగిరి జడ్పీ సీఈవో శోభారాణికి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలిపారు.













