రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు వరి విత్తనాలు పంపిణీ. NTODAY NEWS రిపోర్టర్ (వీరమల్ల శ్రీను) 17/6/2025 మంగళవారం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద పంచాయతీలోని వరి రైతులకు వరి 1064,BPT 5204,MTU1064,MTU 1121, రకాల విత్తనాల సబ్సిడీ పై పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు పంచాయతీలోని రాచన్నగూడెం, తాటి రామన్నగూడెం, గోపాలపురం, లంకలపల్లి, జిల్లెలు గూడెం, గ్రామాలలో సుమారుగా 122 మంది రైతులకు 37 క్వింటాల […]
విద్యార్థులకు ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలు అందచేత
విద్యార్థులకు ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలు అందచేత శ్రీబొల్లిన గంగరాజు జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం అందించిన దుస్తులు పాఠ్య పుస్తకాలను తెదేపా గ్రామ అధ్యక్షులు బొల్లిన విజయభాస్కర్ చేతులమీదుగా విద్యార్థులకు అందించారు. కార్యక్రమంలో హెచ్ఎం వూబా చంద్రరావు హైస్కూల్ కమిటీ చైర్మన్ బొంత సోమరాజు జూనియర్ కళాశాల చైర్మన్ గద్దె శ్రీనివాస్ తెదేపా నాయకులు మండ సుబ్బారావు మర్రి వెంకటేసు కొమ్మర్తి మహేష్ పతంజలి ఉపాద్యాయులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube
మరొకసారి మానవత్వం చాటుకున్న గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు
మరొకసారి మానవత్వం చాటుకున్న గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు నియోజకవర్గ ప్రజలను ఆపదలో ఆదుకునే వ్యక్తిగా మరొకసారి నిలిచారు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న ఓ చిన్నారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 10 లక్షలు ఆర్థిక సహాయం అందించి, ఆ కుటుంబానికి అండగా ఉంటానని MLA మద్దిపాటి వెంకటరాజు ధైర్యం చెప్పారు. గోపాలపురం నియోజకవర్గo , ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం సాయం పాలెం గ్రామానికి చెందిన హరిబాబు రాజేశ్వరి […]
ఇంటర్ విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ అందజేత
ఇంటర్ విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ అందజేత తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఐఐటీ జేఈఈ ఏపీఎంసెట్ నీట్ మొదలైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన మెటీరియల్ను కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గద్దె శ్రీనివాస్ దుగ్గిరాల నీరసత్యం చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. కళాశాల డెవలప్మెంట్ చైర్మన్ గద్దె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందించే ఐఐటి జేఈఈ మెటీరియల్ను ఉపయోగించుకుని అందరి విద్యార్థులు మంచి స్థాయికి ఎదిగి […]
పార్డ్ ఇండియా కంప్యూటర్ శిక్షణా సర్టిఫికెట్లు ప్రధానం
పార్డ్ ఇండియా కంప్యూటర్ శిక్షణా సర్టిఫికెట్లు ప్రధానం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో ని పార్డ్ ఇండియా కార్యాలయంలో మంగళవారం సంస్థ వేసవిలో నిర్వహించు ఉచిత కంప్యూటర్ శిక్షణా తరగతుల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పంచాయితీ కార్యదర్శి ఏ అమ్మిరాజు మాట్లాడుతూ పార్డ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ గ్రామాభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం అభినందనీయమని అన్నారు. 2011 నుండి విలేజ్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుచేసి ప్రతీ […]
ట్రూలైట్ ఇంగ్లీష్ స్కూల్ ప్రారంభించిన వ్యవసాయ వేత్త
ట్రూలైట్ ఇంగ్లీష్ స్కూల్ ప్రారంభోత్సవం చేసిన వ్యవసాయ వేత్త ఋషి కేశవరావు దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో నూతనంగా ప్రారంభించిన ట్రూ లైట్ ఇంగ్లీష్ స్కూల్ ను ప్రముఖ వ్యవసాయ వేత్త పిన్నమనేని ఋషి కేశవరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు. సమాజ ఉన్నతికి విద్య మాత్రమే అత్యంత దోహదం చేస్తుందని విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అని తెదేపా నాయకులు పెన్మెత్స సుబ్బరాజు అన్నారు. కేరళ విద్యావిధానంతో విద్యార్థుల్లో నైతిక విలువలు […]
గ్రంథాలయంలో ముగిసిన వేసవి విజ్ఞాన శిబిరం
గ్రంథాలయంలో ముగిసిన వేసవి విజ్ఞాన శిబిరం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం లోని యర్నగూడెం శాఖా గ్రంథాలయం నందు వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ బొంతా భరత్ బాబు తెదేపా గ్రామ అధ్యక్షులు బొల్లిన విజయ భాస్కర్ పంచాయితీ కార్యదర్శి ఏ అమ్మిరాజు ఎంపిటిసి గంగవరపు రత్నావతి పాల్గొన్నారు. గ్రంథాలయంలో నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరం ద్వారా విద్యార్థుల్లో మరింత సృజనాత్మకత పెరుగుతుందని ప్రతీ ఒక్కరూ విజ్ఞానం పెంపొందేందుకు గ్రంథాలయ […]
చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ రాంబాబు ఆధ్వర్యంలో వనం – మనం కార్యక్రమం
చింతలపూడి లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ రాంబాబు ఆధ్వర్యంలో వనం – మనం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ హాజరై కూటమి నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి మానస […]
ఏలూరు నగరాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
ఏలూరు నగరాన్ని పచ్చదనంతో హరితవనంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య,నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు పిలుపునిచ్చారు. పర్యావరణం-పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం పోణంగి డంపింగ్ యార్డ్ కాంపౌండ్ లోపల రోడ్డుకు పక్కగా ఉన్న ప్రాంతంలో అడవిల (ఫారెస్ట్) తయారు చేసే విధంగా మొక్కలు నాటారు, అనంతరం టిట్కో ఇల్లు ప్రాంతంలో రోడ్డు పక్కనే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మొక్కలు […]
మొక్కలు నాటిన జిల్లా పరిషత్ చైర్పర్సన్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ స్వయంగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ — “పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. భవిష్యత్ తరాల […]