మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విప్ బీర్ల అయిలయ్యకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంస NTODAY NEWS: హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి అయిలయ్య ముఖ్యమంత్రిని మంగళవారం కలిశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం […]
మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవ ఎన్నిక
చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పందిరి గీత ఏకగ్రీవ ఎన్నిక వైస్ చైర్‌పర్సన్‌గా గుండెబోయిన శ్రీలక్ష్మి ప్రమాణ స్వీకారం NTODAY NEWS: చిట్యాల, నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ నూతన పాలకవర్గంలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులు మహిళలకు దక్కాయి. 12వ వార్డు నుంచి ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పందిరి గీత రమేష్ చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిట్యాల చరిత్రలో తొలి మహిళా చైర్‌పర్సన్‌గా ఆమె నిలిచారు. సోమవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల […]
ధర్మపురి మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ పట్టు
ధర్మపురి మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ పట్టు: చైర్మన్‌గా వేముల నాగలక్ష్మి NTODAY NEWS: ధర్మపురి,(గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ) ధర్మపురి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే జరిగిందని రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. సోమవారం జరిగిన ప్రత్యేక సమావేశానికి హాజరైన మంత్రి, నూతన పాలకవర్గ వివరాలను ప్రకటించారు. పదవుల పంపకం ఇలా: మున్సిపల్ చైర్మన్ (మొదటి 2 ఏళ్లు): వేముల […]
చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు బీసీలకే కేటాయించాలి
చిట్యాల మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు బీసీలకే కేటాయించాలి: బీసీ యువజన సంఘం NTODAY NEWS: చిట్యాల, నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు కేటాయించాలని బీసీ యువజన సంఘం జిల్లా నాయకుడు ఎడ్ల మహాలింగం డిమాండ్ చేశారు. మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి గత పాలకవర్గంలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్లో బీసీలకు ప్రాతినిధ్యం లభించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి జరిగే […]
జగిత్యాల మున్సిపల్ విజేతల సందడి
జగిత్యాల మున్సిపల్ విజేతల సందడి – జిల్లా నాయకులను కలిసి కృతజ్ఞతలు తెలిపిన బిఆర్ఎస్ అభ్యర్థులు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ జగిత్యాల పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు శనివారం జిల్లా స్థాయి పార్టీ నాయకత్వాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. గెలుపొందిన దేవేందర్ నాయక్, అవారి పవిత్ర, శివ కేసరి బాబు, కోరుగంటి రాము, హరీష్ తదితరులు పార్టీ అగ్రనేతలకు కృతజ్ఞతలు తెలిపారు. విజేతలు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల […]
జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 163 అమలు
మున్సిపల్ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 163 అమలు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి, జిల్లాలో భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీలలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పరోక్ష ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ వరకు భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 163 (144) అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన […]
కౌంటింగ్ రోజే బీజేపీ అభ్యర్థి మృతి
లక్షెట్టిపేటలో విషాదం: కౌంటింగ్ రోజే బీజేపీ అభ్యర్థి ఎల్లమ్మ మృతి NTODAY NEWS: మంచిర్యాల ప్రతినిధి శ్రీనివాస్ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున విషాద ఘటన చోటుచేసుకుంది. 10వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎల్లమ్మ అనారోగ్యంతో శుక్రవారం మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్లమ్మ పరిస్థితి కౌంటింగ్ సమయంలో విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఫలితాల ఉత్కంఠ నడుమ ఆమె మృతి వార్త […]
కౌంటింగ్ హాళ్లలో మొబైల్ ఫోన్లకు నో ఎంట్రీ
కౌంటింగ్ హాళ్లలో మొబైల్ ఫోన్లకు నో ఎంట్రీ: జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కౌంటింగ్ హాళ్లలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. రేపు నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, కెమెరాలు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాలు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పూర్తిగా నిషేధించినట్లు స్పష్టం చేశారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు […]
మున్సిపల్ కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలి:
మున్సిపల్ కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కౌంటింగ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కౌంటింగ్ ఎన్నికలలో అత్యంత కీలక దశ అని పేర్కొన్న కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రాథమిక మరియు వివరణాత్మక లెక్కింపును నిర్వహించాలని సూచించారు. రూల్ […]
మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు పటిష్ట ఏర్పాట్లు
మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు పటిష్ట ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ పరిశీలన NTODAY NEWS: యాదాద్రి భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు గురువారం పరిశీలించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణతో కలిసి దివ్య బాల స్కూల్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ హాళ్ల […]









