Tag: Telangana

హనుమకొండ విద్యాశాఖలో పారదర్శకతపై పెద్ద ప్రశ్న

సమాచార హక్కు చట్టం ఉందా… లేదా? హనుమకొండ విద్యాశాఖలో పారదర్శకతపై పెద్ద ప్రశ్న NTODAY NEWS: ఆర్టీఐ  దేశ ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలపై ప్రశ్నించే హక్కును కల్పించిన గొప్ప చట్టం సమాచార హక్కు చట్టం – 2005 (RTI Act). కానీ ఈ చట్టం కేవలం పుస్తకాలకే పరిమితమైపోయిందా? హనుమకొండ జిల్లా విద్యాశాఖలో జరుగుతున్న పరిణామాలు ఇదే అనుమానాన్ని బలపరుస్తున్నాయి. డ్రాయింగ్ & క్రాఫ్ట్ పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోరుతూ ఒక నిరుద్యోగ […]

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

లోత్తునూర్ గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని లోత్తునూర్ గ్రామ సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోత్తునూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి మంజూరైన చెక్కులను సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, సంక్షేమ శాఖ చొరవతో గ్రామానికి చెందిన […]

RTI చట్టం అమలులో నిర్లక్ష్యం

RTI చట్టం అమలులో నిర్లక్ష్యం: అధికారుల బాధ్యత ఎక్కడ? సమాచార హక్కు పటిష్టంగా అమలు చేయాలి: ఆర్టీఐ సతీష్ NTODAY NEWS: ఆర్టీఐ  ✦ ప్రజల హక్కుపై అధికారుల అలసత్వం సమాచార హక్కు చట్టం–2005 (RTI) ప్రజాస్వామ్యంలో ప్రజలకు లభించిన శక్తివంతమైన ఆయుధం. ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడమే దీని ఉద్దేశ్యం. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో RTI దరఖాస్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ✦ సమాచారం ఇవ్వకపోయినా శిక్షలు లేవు […]

మేడారం సమ్మక్క–సారలమ్మ అమ్మవార్ల దర్శనం

మేడారం సమ్మక్క–సారలమ్మ అమ్మవార్ల దర్శనం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, స్నేహలత దంపతులు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ములుగు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, స్నేహలత దంపతులు గురువారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. మొక్కుల సమర్పణ అమ్మవార్ల గద్దెల వద్ద ఈశ్వర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనదేవతలకు పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా […]

ఉద్యోగులకు ఉపయోగపడే సమాచార దీపిక

కరీంనగర్ జిల్లా ఎన్జీవోల సంఘం డైరీ–2026 ఆవిష్కరణ ఉద్యోగులకు ఉపయోగపడే సమాచార దీపిక: కలెక్టర్ పమేలా సత్పతి NTODAY NEWS: గొల్లపల్లి మండలం ప్రతినిధి కరీంనగర్, తెలంగాణ ఎన్జీవోల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ రూపొందించిన డైరీ–2026ను శనివారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రత్యేక అతిథిగా పాల్గొని తొలి ప్రతిని విడుదల చేశారు. ఉద్యోగులకు ఎంతో మేలు […]

అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్‌కు ఘన నివాళి

అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్‌కు ఘన నివాళి జగిత్యాలలో అలిశెట్టి జయంతి, వర్ధంతి వేడుకలు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ NTODAY NEWS: గొల్లపల్లి న్యూస్ రిపోర్టర్ తెలంగాణ అక్షర సూర్యుడు, జగిత్యాల ముద్దుబిడ్డ అలిశెట్టి ప్రభాకర్ జయంతి మరియు వర్ధంతిని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలో సోమవారం ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని అంగడి బజార్ కూడలిలో ఉన్న అలిశెట్టి ప్రభాకర్ విగ్రహానికి జిల్లా తొలి జడ్పీ మాజీ చైర్‌పర్సన్ […]

సంక్రాంతి కానుక కిట్‌ను ప్రారంభించిన మంత్రి

సంక్రాంతి కానుక కిట్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని, సుర్వి రామచందర్ గౌడ్ జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన SRG ఫౌండేషన్ ఆధ్వర్యంలోని సంక్రాంతి కానుక కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల […]

డివైఎఫ్ఐ–ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

డివైఎఫ్ఐ–ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు NTODAY NEWS: నల్గొండ  శివాజీనగర్‌లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) మరియు ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముగ్గుల, క్రీడల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. డివైఎఫ్ఐ యువతకు విద్య, […]

సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక

వెల్గటూర్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా కూస లక్ష్మణ్ ఏకగ్రీవ ఎన్నిక NTODAY NEWS: వెల్గటూర్ మండలం  వెల్గటూర్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడి ఎన్నిక శనివారం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది. మొక్కట్రావుపేట గ్రామ సర్పంచ్ కూస లక్ష్మణ్ను మండల సర్పంచ్‌ల ఫోరం నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని సర్పంచ్‌లందరూ ఏకాభిప్రాయంతో ఆయనను ఈ పదవికి ఎంపిక చేశారు. అభినందనల వెల్లువ కూస లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో తోటి సర్పంచ్‌లు, రాజకీయ నాయకులు మరియు […]

నిత్య జలాభిషేకంతో దర్శనమిచ్చే స్తంభంపల్లి వేంకటేశ్వరుడు

అద్భుతం.. నిత్య జలాభిషేకంతో దర్శనమిచ్చే స్తంభంపల్లి వేంకటేశ్వరుడు వందల ఏళ్ల చరిత్ర.. ధనస్సు ధరించిన విశిష్ట రూపం.. మాఘ మాస బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న పురాతన క్షేత్రం NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ ప్రకృతి ఒడిలో, ఆధ్యాత్మిక పరిమళాల మధ్య వెలసిన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతోంది. సుమారు 600 నుంచి 800 ఏళ్ల చరిత్ర […]

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »