Tag: YadadriBhuvanagiri

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి NTODAY NEWS: బొమ్మలరామారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ దశల్లో కొనసాగుతున్న ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. గ్రామంలో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి, వాటిలో ఎన్ని ఇండ్లు […]

హోలీ వేడుకల్లో పాల్గొన్న బీర్ల అయిలయ్య

గిరిజన తండాలో హోలీ వేడుకల్లో పాల్గొన్న బీర్ల అయిలయ్య NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా బంజారాలతో కలిసి సంప్రదాయ నృత్యాలు బొమ్మలరామారం మండలం గోవింద్ తండాలో హోలీ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. హోలీ సందర్భంగా తండా వాసులతో కలిసి రంగులు చల్లుకుంటూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. బంజారా సోదర సోదరీమణులతో కలిసి సంప్రదాయ నృత్యాల్లో పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు. […]

పథకం ప్రకారం హత్యకు కుట్ర

పథకం ప్రకారం హత్యకు కుట్ర NTODAY NEWS: బొమ్మలరామారం, యాదాద్రి భువనగిరి జిల్లా ఎనిమిది మంది అరెస్ట్, ఒకరు పరారీలో బొమ్మలరామారం, ఫిబ్రవరి 27: ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కారణంతో ఓ యువకుడిపై పథకం ప్రకారం హత్యాయత్నానికి పాల్పడిన ఘటన బొమ్మలరామారం మండలంలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని బొమ్మలరామారం ఎస్‌ఐ బుగ్గ శ్రీశైలం వెల్లడించారు. హైదరాబాద్ నేరేడ్‌మెట్‌కు చెందిన సాటల అజయ్ కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం రామలింగంపల్లి గ్రామానికి చెందిన యువతితో మూడు […]

టైర్ల కంపెనీ మూసివేయాలని డిమాండ్

టైర్ల కంపెనీ మూసివేయాలని రంగాపూర్ గ్రామస్తుల డిమాండ్ NTODAY NEWS: బొమ్మలరామారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం రంగాపురం గ్రామానికి సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న టైర్ల కంపెనీని తక్షణమే మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మెరుపు చెరువు కట్ట వెనుక భాగంలో ఎన్ అండ్ ఎన్ పేరుతో నిర్వహిస్తున్న టైర్ల కంపెనీ నుంచి అధికంగా పొగ, కాలుష్యం వెలువడుతోందని గ్రామస్థులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో […]

మసీదుల వద్ద సమగ్ర సదుపాయాలు కల్పించాలి

రంజాన్ సందర్భంగా మసీదుల వద్ద సమగ్ర సదుపాయాలు కల్పించాలి: అదనపు కలెక్టర్ NTODAY NEWS: యాదాద్రి భువనగిరి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని మసీదుల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మినీ మీటింగ్ హాలులో నిర్వహించిన శాంతి సంఘ సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. రంజాన్ ఏర్పాట్లపై కేటాయించిన విధులను శాఖల మధ్య సమన్వయంతో నిర్వహించాలని తెలిపారు. […]

ప్రతి మండలంలో జాబ్ కార్డులు జారీ చేయాలి

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రతి మండలంలో జాబ్ కార్డులు జారీ చేయాలి: జిల్లా కలెక్టర్ NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, పూర్తిచేసిన లబ్ధిదారులకు జాబ్ కార్డులు తప్పనిసరిగా జారీ చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం మినీ మీటింగ్ హాల్లో ఎంపీడీవోలు, ఎంపీఓలు, హౌసింగ్ సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై మండలాల […]

ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి

రబీ వరి ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి: అదనపు కలెక్టర్ భాస్కరరావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా రబీ 2025-26 వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సంబంధిత అధికారులు సమగ్ర ముందస్తు ప్రణాళికలు రూపొందించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ధాన్యం సేకరణలో పాల్గొనే శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా […]

అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి

అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వివిధ పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలో మంజూరైన పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో, ఎంత మేర […]

ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథావిధిగా నిర్వహణ

గురువారం ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథావిధిగా నిర్వహణ: జిల్లా కలెక్టర్ ప్రకటన NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లాలో ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ మరియు ఉద్యోగవాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఫిబ్రవరి 19, 2026 (గురువారం) నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రజలు మరియు ఉద్యోగుల నుండి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత, పరిపాలనా మరియు ఉద్యోగ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులను కలెక్టరేట్‌లో సమర్పించవచ్చని సూచించారు. జిల్లా ప్రజలు ఈ […]

జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 163 అమలు

మున్సిపల్ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 163 అమలు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి,  జిల్లాలో భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీలలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పరోక్ష ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ వరకు భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 163 (144) అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన […]

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »