నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు,బాలల స్నేహపూర్వక న్యాయ అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు అన్నారు …
NTODAY NEWS: ఏలూరు,ఆగస్టు 06:
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ అమరావతి వారి ఆదేశాలు ప్రకారం “జాతీయ న్యాయ సేవాధికార సంస్థ-బాలల స్నేహ పూర్వక న్యాయ సేవలు పథకం 2024” పై బాలలకు అవగాహన కలిగించాల్సి ఉందని అందులో భాగంగా బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనము నందు ఏలూరు శాంతి నగరులోని ఆక్సఫోర్డ్ ఒలింపియాడ్ స్కూలు విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి కె.రత్నప్రసాదు మాట్లాడుతూ బాలలు విద్యార్థి దశ ఉండే చట్టాల పైన పూర్తి అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలుసుకుని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.ప్రస్తుత సమాజంలో విద్యార్థులే లక్ష్యంగా సంఘ విద్రోహ శక్తులు మానవ అక్రమ రవాణా,డ్రగ్స్ విక్రయం లాంటి దుశ్చర్యలకు పాల్పడు తున్నాయని కావున యువత అపరిచిత వ్యక్తులతో అతి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయరాదని, అలాగే గుడ్ టచ్ బాడ్ టచ్ పైన అవగాహన కలిగి ఉండాలని బాల్య వివాహాలను నిరోధించడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. బాలలకు అవసరమైన పక్షంలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసి ఇంచార్చి చైర్మన్ పి.వెంకటేశ్వర రావు,న్యాయవాది పి.రత్నరాజు, ఆక్స్ ఫోర్డ్ ఒలింపియాడ్ స్కూల్ ప్రిన్సిపల్ పసుపులేటి సునీల్ కుమార్,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.













