సెకెండ్ క్లాస్ మేజిస్ట్రేట్ బాధ్యతలు స్వీకరణ

Spread the love

సెకెండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గా దంతూరి సత్తయ్య బాధ్యతలు స్వీకరణ

– ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష హాజరు

NTODAY NEWS : రామన్నపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట అదనపు కోర్టు కి సెకెండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గా దంతూరి సత్తయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండీ.మస్జిద్ అధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి సభ్యులందరూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష హాజరయ్యారు. అనంతరం వారూ మాట్లాడుతూ జ్యుడిషియల్ వ్యవస్థలో నిబద్దతతో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఉంటాయని అన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ మాతో పాటు కలసి పని చేసిన ఉన్నత హోదాలో వెల్లినందున సభ్యులందరూ శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ యాపాల కృష్ణ రెడ్డి, కంపాటి యాదగిరి, జినుకల ప్రభాకర్, కేమా రామదాసు, ఉయ్యాల హనుమంతు గౌడ్, బర్ల డేవిడ్, నకిరేకంటి మోగులయ్య, యాదాసు యాదయ్య, దినేష్ కుమార్, మామిడి వెంకట్ రెడ్డి, నోముల స్వామి, ఏళ్ల శ్రీశైలం, కూనురూ శ్రీనివాస్, ఎండీ.అజిజోద్దిన్, మహిళ న్యాయవాది రజియా బేగం, తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »