గురువులే విద్యార్థులకు మార్గదర్శకం — తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
NTODAY NEWS: రిపోర్టర్ కూనురు మధు
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో గురుపౌర్ణమి పురస్కరించుకొని గురువారం రోజున తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ది హార్ట్ ఆఫ్ ది లివింగ్ స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు సన్మానించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ మాట్లాడుతూ ఈ గౌరవం నాది కాదు.. ఇది నాకు తల్లిగా నిలిచిన ఉరుమడ్ల గ్రామానికి, గురువుల పట్ల నాకు ఉన్న ఆత్మీయతకు వేసిన ముద్ర అని పేర్కొన్నారు. గురువులు చెప్పిన మాట వింటే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని , గురువులు మన జీవితాల్లో వెలిగించే జ్యోతులు అని, నేనూ కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు గురువుల మార్గనిర్దేశం వల్లనే ఈ స్థాయికి చేరుకున్నానని ఈ తరం పిల్లలు తమ గురువులను స్మరిస్తూ ముందుకు సాగాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి గౌడ్, సోషల్ మీడియా ఇంచార్జ్ పట్ల జనార్ధన్, మర్రి రమేష్, గుత్తా రవీందర్ రెడ్డి, పాకాల దినేష్, ఉయ్యాల నరేష్ గౌడ్, మేడబోయిన శ్రీనివాస్ యాదవ్, గంగాపురం వెంకన్న గౌడ్, జన్నపాల జానయ్య తదితరులు పాల్గొన్నారు.













