తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు
NTODAY NEWS: ఎల్బీనగర్
నాగోల్ సాయి నగర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహణ
నాగోల్ సాయి నగర్‌లో ఆదివారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను సీపీఐ నాయకురాలు బేగం పాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి. నరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “తెలంగాణ సాయుధ పోరాటం దేశ చరిత్రలో ఒక విశిష్టమైన అధ్యాయం. భూస్వాముల దోపిడీ, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా రైతులు, కూలీలు, పేదలు సాగించిన ఉద్యమమే నేటి సమాజ మార్పులకు పునాది. భవిష్యత్తులో తెలంగాణలో పేదరికం నిర్మూలన, సామాజిక సమానత్వం సాధించేందుకు సీపీఐ నిరంతరం కృషి చేస్తుంది” అని అన్నారు.అలాగే సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 11 నుండి 17 వరకు సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహించడం వెనుక ఉద్దేశ్యం కొత్త తరాలకు పోరాట చరిత్రను పరిచయం చేయడం, రైతాంగం చేసిన త్యాగాలను గుర్తుచేయడం అని వివరించారు.కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకురాలు ప్రేమ్ పావని, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చాయదేవి, జిల్లా కార్యదర్శి స్టాలిన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు ఎం.డి. పైమిద ప్రసంగిస్తూ, “సాయుధ పోరాటం పాఠాలు ఈ రోజుకి కూడా సజీవంగానే ఉన్నాయి. రైతులు, కూలీల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం కొనసాగించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సీపీఐ నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని నినాదాలు చేస్తూ సాయుధ పోరాట వీరులకు నివాళులర్పించారు.













