ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అవతరణ దినోత్సవ వేడుకలు

Spread the love

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అవతరణ దినోత్సవ వేడుకలు.

NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, జూన్ 02

సోమవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి, భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న,జిల్లా కలెక్టర్ హనుమంతరావు,డిసిపి అక్షాంష్ యాదవ్ తో కలసి పోలీసు వందనం స్వీకరించారు . తెలంగాణ తల్లి, మహనీయుల చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళాలు అర్పించారు.అనంతరం జాతీయ పతాకావిష్కరణ గావించారు. తదుపరి జిల్లా ప్రగతి నివేదికను ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్తు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరుగుచున్న వేడుకలకు విచ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, స్వాతంత్య్ర సమరయోధులకు,అధికారులకు, అనధికారులకు,పాత్రికేయులకు, విద్యార్థినీ,విద్యార్థులకు మరియు జిల్లా ప్రజలందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
దశాబ్దాల కల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం.ఆరు దశాబ్దాల పోరాటం, అమరవీరుల త్యాగాల ఫలంగా 2014 జూన్ 2న 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచం నలుమూలలో ఉన్న తెలంగాణ ప్రజలు రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా వారందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.
తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచస్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ -2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి అయోగ్ సమావేశంలో వెల్లడించారు.
తెలంగాణ రైజింగ్-2047 కీలకాంశాలు
తెలంగాణ రైజింగ్-2047 విజన్ లో నాలుగు కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్రపాలసీల రూపకల్పన, ప్రపంచస్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తారు.ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలుచర్యలు చేపట్టింది.

తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టీస్ పాలసీ, గ్రీన్ ఎనర్జిపాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది.

ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖలనే మార్చేస్తుంది.

ఆడబిడ్డలకు అండదండలు

ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే, రాష్ట్రంలో కోటిమంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది.

ఆర్టీసీ బస్సుల్లో ఉచితప్రయాణం, 500 రూపాయలకే వంటగ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇళ్ళు వంటి పథకాలతో పాటు, సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటుచేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మహిళలు పెట్రోలు బంకుల నిర్వహణ, మహిళాశక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారు. శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్ళను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలుచేయించి, ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో 150 బస్సులు ఇప్పటికే అందజేయటం జరిగింది.

మహా లక్ష్మి పధకం ద్వారా మన జిల్లాలో ఇప్పటివరకు RTC బస్సులలో 1 కోటి 31 లక్షల మహిళా ప్రయాణికులకు 65 కోట్ల 92 లక్షల రూపాయలతో ఉచిత ప్రయాణం కల్పించనైనది. అంతేకాకుండా వంట గ్యాస్ సిలిండర్ ను తక్కువ ధరకు అందించాలని ఉద్దేశ్యంతో 500 రూపాయలకు LPG సబ్సిడీ సిలిండర్ ఇవ్వాలని సంకల్పించి, అందులో భాగంగా మన జిల్లాలో 1 లక్ష 25 వేల 910 మంది మహాలక్ష్మి పధకం క్రింద అర్హులుగా గుర్తించి, 5 లక్షల 56 వేల 172 సిలిండర్ల ను అందచేసి 17 కోట్ల 05 లక్షల రూపాయలను వారి ఖాతాలలో సబ్సిడీ మొత్తమును జమ చేయడం జరిగింది.

గృహజ్యోతి పథకంలో భాగంగా ఇప్పటివరకు 53 కోట్ల 13 లక్షల 87 వేల రూపాయల విలువ గల విద్యుత్ ను 1 లక్ష 45 వేల 774 మంది వినియోగదారులకు మార్చి 2024 నుండి జీరో బిల్ ఇవ్వడం జరుగుచున్నది.

మహిళలు పెట్రోలు బంకుల నిర్వహణ, మహిళాశక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారు. శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్ళను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా సమీకృత జిల్లా కార్యాలయముల సముదాయం, జిల్లా కలెక్టరేట్, యాదాద్రి భువనగిరి యందు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంబించడం జరిగింది.

మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలుచేయించి, ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో 150 బస్సులు ఇప్పటికే అందజేయటం జరిగింది.

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం
రాష్ట్రంలో నిరుపేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం.రాష్ట్రంలో 4లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం లక్ష్యం. మహిళల పేరు మీదనే ఇండ్ల మంజూరు.

మన జిల్లా వ్యాప్తంగా మొదటి విడతగా ప్రతి మండలానికి ఒక గ్రామం చొప్పున, 17 గ్రామాల నుండి 762 మంది లబ్దిదారులకు మంజూరు చేయడం జరిగింది. మొదటి విడతలో మంజూరి చేసిన గ్రామాలలో ఇప్పటివరకు 492 ఇండ్లకు మార్కింగ్ చేయటం జరిగింది. ఇందులో 268 ఇండ్లు బేస్మెంట్ స్టేజి లో ఉండగా, 37 ఇండ్లు రూఫ్ స్టేజ్ లో ఉన్నాయి. 8 ఇండ్లు స్లాబ్ లు పూర్తి అయినయి. తదుపరి రెండవ విడతలో 8 వేల 191 మంది లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగినది.
చెంచులకు ఇందిరమ్మ ఇళ్ళు

రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలలోని చెంచులకు 10వేల గృహాలు కేటాయింపు.

రైతులకు రుణవిముక్తి

దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలల కాలంలో 25 లక్షల 35 వేల 964 మంది రైతులను రుణవిముక్తులను చేయడం జరిగింది. 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. రైతుకు పెట్టుబడి సాయం పెంచి, రైతుభరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం.

రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తూ, ధాన్యం కొనుగోలుచేసిన 24 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమచేయడం జరుగుతోంది.

గత ఏడాది 2.90 కోట్ల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచారు.

అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10 వేల రూపాయలు పరిహారం ఇస్తున్నాం.

సన్నధాన్యానికి క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నాం.

భూసమస్యల పరిష్కారం కొరకు భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చాము. ఆత్మకూర్ మండలాని పైలెట్ మండలముగా తీసుకొని రెవెన్యూ సదస్సులు నిర్వహించాము. జూన్ 3 వ తేదీ నుండి జిల్లాలోని అన్నీ రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతున్నాం.

భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయటం జరుగుతోంది.

“రైతు బీమా” పథకం ద్వారా మన జిల్లాలో గత సంవత్సరము నుండి మరణించిన 366 మంది రైతుల కుటుంబాలకు 18 కోట్ల 30 లక్షల రూపాయలు వారి నామిని ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఈ కార్యక్రమము క్రింద మన జిల్లాలో ఇప్పటివరకి 4 దఫాలుగా 76 వేల 250 మంది రైతులకు 625 కోట్ల 45 లక్షల రూపాయల ఋణ మాఫీ చేయడం జరిగింది.

రైతు భరోసా: రైతుకు పెట్టుబడి సాయం పెంచి, రైతుభరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం. రైతు భరోసా పథకo క్రింద జిల్లాలో 1 లక్షా 88 వేల 526 మంది రైతులకు 174 కోట్ల 11 లక్షల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడము జరిగింది.

రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తూ, ధాన్యం కొనుగోలుచేసిన 24 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమచేయడం జరుగుతోంది. గత ఏడాది 2.90 కోట్ల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. జిల్లాలో 2024-25 యాసంగి సాగుకు సంబంధించి 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు 3 లక్షల 51 వేల 361 మెట్రిక్ టన్నుల వరి ధాన్యంను 39 వేల 846 రైతుల నుండి కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించి వారికీ 739 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలలో జమచేయడం జరిగింది. కాగా, సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాలుకు 500 రూపాయలలు బోనస్ గా చెల్లించుచుoడగా, ఈ యాసంగి పంటకాలంలో 970 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం సేకరించటం జరిగింది.

అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10 వేల రూపాయలు పరిహారం ఇస్తున్నాం.

నిరుపేదలకు సన్నబియ్యం :

పేదల ఆకలి తీర్చటంతోపాటు, వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇళ్ళు, సన్నబియ్యం పథకాలను అమలుచేస్తున్నాం. మన జిల్లాలో 515 రేషన్ షాపుల ద్వారా మొత్తం 2 లక్షల 18 వేల 963 కుటుంబాలకు సన్నబియ్యం పంపిణి చేయడం జరుగుచున్నది. జిల్లాలో నూతన రేషన్ కార్డుల మంజూరి ప్రక్రియ జరుగుచుoడగా, మార్చి 2025 నుండి నేటివరకు 1 వేయి 915 నూతన కార్డులు మంజూరి చేయగా, 45 వేల 578 యూనిట్లు చేర్పులు చేయడo జరిగింది మరియు రేషన్ పంపిణి చేయటం జరుగుతుంది.

ఎస్సీవర్గీకరణతో సామాజిక న్యాయం
సంక్షేమంతోపాటు సామాజికన్యాయంలో సయితం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తోంది.దేశంలో ఎస్సీవర్గీకరణ చేసిన తొలిరాష్ట్రం తెలంగాణ.

షెడ్యూల్ కులాల విద్యార్థుల కొరకు మన జిల్లాలోని 19 వసతి గృహములలో 1 వేయి 85 మందికి, అలాగే 2 కళాశాల వసతి గృహాలలో 246 మందికి ప్రవేశం కల్పించడం జరిగినది. పోస్టు మెట్రిక్ మరియు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనముల ద్వారా 2024-25 సంవత్సరoలో 3 వేల 484 మంది విద్యార్థినీ, విద్యార్థులకు 10 కోట్ల 49 లక్షల రూపాయలు మంజూరి చేయనైనది. బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా 2024-25 సంవత్సరoలో ప్రవేశాల కొరకు 93 లక్ష 52 వేల రూపాయలు 315 మంది విద్యార్థులకు ఖర్చు చేయడం జరిగింది.

వెనుకబడిన తరగతుల అభివృద్ధి:
సాంఘిక, విద్య,ఆర్ధిక, ఉద్యోగ, రాజకీయ మరియు కుల సర్వే:

పారదర్శకంగా కులగణన నిర్వహించి , బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మన జిల్లాలో అన్ని గ్రామపంచాయితీలలో మరియు 6 మున్సిపాలిటీలలో సాంఘిక, విద్య,ఆర్ధిక, ఉద్యోగ, రాజకీయ మరియు కుల సర్వే ద్వారా 2 లక్షల 60 వేల 766 కుటుంబాలను సర్వే నిర్వహించడం జరిగింది మరియు సర్వే డేటా మొత్తం కంప్యుటరీకరణ పూర్తి చేయడం జరిగింది.

యువతకు ఉపాధి, ఉద్యోగాలు
ఈ రాష్ట్ర యువతే ప్రజా ప్రభుత్వ నిజమైన నిర్మాతలు. వారి భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ, యువత ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేసింది. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి, ప్రయివేటు రంగంలో లక్ష ఉద్యోగాలు సృష్టిస్తున్నాం.

రాజీవ్ అభయ హస్తం పథకం కింద సివిల్స్ చదివే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నాం.

తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఎకానమీ స్టేట్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టాం.
25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 58 పాఠశాలల నిర్మాణం చేపట్టాం. జిల్లాలో ఆలేరు మరియు భువనగిరి శాసనసభల పరిదిలో 400 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ళను మంజూరీ చేయడం జరిగింది.
పాఠశాలల అభివృద్ధికి విద్యాకమీషన్ ఏర్పాటుచేశాం.

హైదరాబాద్ కు అంతర్జాతీయ హంగులు
హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధిచేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టాం. జీ.హెచ్.ఎం.సి లో కంటోన్మెంట్ విలీనం చేయాలన్న ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చాం.
ఫ్యూచర్ సిటీ పేరుతో 30 వేల ఎకరాలలో సరికొత్త నగర నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అభివృద్ధి ప్రణాళికలో రాష్ట్రాన్ని మూడు జోన్లుగా వర్గీకరించాం. అవుటర్ రింగ్ రోడ్డు లోపల నగరాన్ని కోర్ అర్బన్ తెలంగాణగా, ఔటర్ రింగ్ రోడ్డు- ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా, రీజినల్ రింగ్ రోడ్డు ఆవల ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా నిర్ణయించాం.
వరంగల్ విమానాశ్రయాన్ని సాధించాం.
విశ్వ వేదికపై తెలంగాణ

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడంలో విజయం సాధించాం. అమెరికా, దక్షిణకొరియా, సింగపూర్, దావోస్, జపాన్ దేశాలలో పర్యటించి బారీగా పెట్టుబడులు సాధించాం.

హైదరాబాద్ వేదికగా పలు గ్లోబల్ ఈవెంట్లు నిర్వహించాం. AI గ్లోబల్ సమ్మిట్, బయో ఏషియా సదస్సు, ప్రపంచ సుందరి పోటీలను విజయవంతంగా నిర్వహించాం.
ఉద్యానవన శాఖ:

ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వo పెద్ద ఎత్తున ప్రోహత్సకాలను అందిస్తున్నది. రైతులకు ఆయిల్ పామ్ మొక్కలు, ఎరువులు, అంతర పంటల సాగు మరియు డ్రిప్ ఇరిగేషన్ కొరకు ఎకరాకు 50 వేల 918 రూపాయలు రాయితీ గా అందించడం జరుగుతున్నది. మన జిల్లాలో ఇప్పటివరకు 4 వేల 500 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుచేయబడుచున్నది. 2025-26 సంవత్సరములో 3 వేల 500 ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించడం అయినది.

నీటి పారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి:
గంధమల్ల జలాశయం:
గత ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న ఆలేరు నియోజకవర్గ ప్రజల కోరిక అయిన గంధమల్ల ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వము 9.86 TMC ల సామర్థ్యంతో పరిపాలన అనుమతులు ఇచ్చినది, ఇంతటి సామర్థ్యంతో చాలా గ్రామాలు ముంపునకు గురి అయ్యేవి, అయితే ఈ ప్రభుత్వము 1.410 TMC ల సామర్థ్యంతో ఒక్క గ్రామము కుడా ముంపునకు గురి కాకుండా 571 కోట్ల రూపాయలతో గంధమల్ల జలాశయానికి పరిపాలన అనుమతులు ఇచ్చినది.

ఈ ప్రాజెక్ట్ క్రింద ఆలేరు నియోజకవర్గంలో 56 వేల ఎకరాల ఆయకట్టు మరియు 50 చెరువులను నింపడానికి వీలవుతుంది.

ఈ నెల 6వ తేది నాడు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు గంధమల్ల జలాశయం శంకుస్థాపన చేయడానికి యాదాద్రి భువనగిరి జిల్లాకు వస్తున్నారు.

నృసింహ సాగర్ రిజర్వాయర్ (బస్వాపూర్ రిజర్వాయర్):
నృసింహ సాగర్ 11.39 TMC ల సామర్ధ్యము తో రిజర్వాయర్ నిర్మాణము ఇప్పటివరకు 1 వేయి 571 కోట్ల రూపాయల వ్యయంతో 84% పనులు పూర్తి అయినవి.
భునియాదిగాని, పిల్లాయిపల్లి మరియు ధర్మారెడ్డి కాలువలు:
భునియాదిగాని కాలువ గతంలో మిగిలి పోయిన పనులకు, తిరిగి పనులు ప్రారంభించుటకు గాను మరియు డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణము కొరకు 195 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరo జనవరి 27న ఒప్పందం జరిగింది. ఈ కాలువ యొక్క పనులు పురోగతిలో ఉన్నవి. ఈ కాలువ ద్వారా 14 వేల 575 ఎకరాల నూతన ఆయకట్టు అభివృద్ధి లోకి వస్తుంది మరియు చెరువుల క్రింద 6 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది.

పిల్లాయిపల్లి కాలువ గతంలో మిగిలి పోయిన పనులకు తిరిగి పనులు ప్రారంభించుటకు గాను 58 కోట్ల 30 లక్షల రూపాయలతో ఈ సంవత్సరo మే 3 న ఒప్పందం జరిగింది. ఈ కాలువల యొక్క పనులు పురోగతిలో ఉన్నవి ఈ కాలువ ద్వారా 16 వేల 525 ఎకరాల నూతన ఆయకట్టు అభివృద్ధి లోకి వస్తుంది. మరియు సుమారు 84 చెరువుల క్రింద 6 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది.

ధర్మారెడ్డి కాలువ గతంలో మిగిలి పోయిన పనులకు తిరిగి పనులు ప్రారంభించుటకు గాను 84 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరo మార్చి 29న ఒప్పందం జరిగింది. ఈ కాలువల యొక్క పనులు పురోగతిలో ఉన్నవి ఈ కాలువ ద్వారా 12 వేల 661 ఎకరాల నూతన ఆయకట్టు అభివృద్ధి లోకి వస్తుంది మరియు 5 వేల 126 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది.
చేయూత :
మన జిల్లాలో వృద్దాప్య, వితంతు, వికలాoగుల, కల్లుగీత, చేనేత, ఒంటరి మహిళలు మరియు బీడి కార్మికులు మొత్తం 99 వేల 402 మంది లబ్దిదారులకు నెలకు 24 కోట్ల 88 లక్షల రూపాయల పెన్షన్ ను పంపిణి చేయడము జరుగుచున్నది.
గిరిజన సంక్షేమము :
జిల్లాలో 8 గిరిజన వసతి గృహాలలో 694 మంది విద్యార్ధులు వసతి పొందుతున్నారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ క్రింద 1 వేయి 64 విద్యార్ధినీ విద్యార్ధులకు 96 లక్షల 88 వేల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేయడము జరిగినది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి క్రింద ఇద్దరు గిరిజన విద్యార్దులకు 20 లక్షల రూపాయలు మంజూరీ చేయనైనది. గిరిజనుల భూములకు సాగునీరు, విద్యుత్ సదుపాయానికి “ఇందిర సౌర గిరి జల వికాసం” కార్యక్రమం ప్రారంభం.
మైనారిటీల సంక్షేమ శాఖ :
జిల్లాలో మూడు మైనారిటీ గురుకుల పాఠశాలలలో 860 మంది విద్యార్థులకు విద్యాబోధన జరుగుచున్నది మరియు జిల్లాలో 3 మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలలో 240 విద్యార్థులకు విద్యాబోధన జరుగుచున్నది.
మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ:
జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం ద్వారా 4 ప్రాజెక్టుల పరిధిలో 901 అంగన్ వాడీ కేంద్రాలు పనిచేయుచున్నవి.
ఆరోగ్య లక్ష్మి పధకం ద్వారా 7 వేల 874 మంది బాలింతలకు, గర్భవతులకు మరియు 12 వేల 741 మందికి 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు పోషక ఆహారం అందిస్తున్నాము.
జిల్లాలో దివ్యాంగులకు వికలాoగుల కార్పొరేషన్ ద్వారా ఉచితంగా 57 మంది లబ్దిదారులకు చెవి మిషన్లు, వీల్ చైర్లు, మోటార్ వెహికల్స్, ట్రై సైకిల్స్ మరియు లాప్ టాప్స్ పంపిణి చేయడం జరిగింది.

సంక్షేమ వసతి గృహాలు :

ప్రభుత్వ వసతి గృహాలలో నివశిస్తున్న బాల బాలికలకు డైట్ ఛార్జీలు 40 % మరియు కాస్మోటిక్ ఛార్జీలు 200 % పెంచడం జరిగింది. జిల్లాలో 95 ప్రభుత్వ వసతి గృహాలలో జిల్లా స్థాయి అధికారులు దత్తత తీసుకోని ప్రతి నెల వసతి గృహాలలో వినూత్నముగా నిద్ర చేయడం మరియు వసతి గృహాలలో సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం జరుగుతుంది. ప్రతి ప్రభుత్వ వసతి గృహాలకు కామన్ మెనూ విధానమును పాటించడం జరుగుతుంది.
విద్యా శాఖ :
జిల్లాలో మార్చ్ 2025 లో జరిగిన 10 వ పరీక్షలకు 8 వేల 622 మంది విద్యార్థులు హాజరు కాగా 8 వేల 432 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయినారు. ఉత్తీర్ణతా 97.8 % కాగా 159 పాఠశాలలు 100 % ఉత్తీర్ణత సాదించి గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 7వ స్దానం సాదించడం జరిగింది.

ఇంటర్మీడియట్ విద్య:

జిల్లాలో మార్చి 2025 లో జరిగిన వార్షిక పరీక్షలలో 11 వేల 738 మంది విద్యార్థులకు గాను 7 వేల 390 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారు.

వైద్య మరియు ఆరోగ్య శాఖ:
మన జిల్లాలో 2024-25 సంవత్సరములో మాతా శిశు ఆరోగ్య కిట్ పధకం ద్వారా ఇప్పటివరకు 13 వేల 67 మంది గర్భిణి స్త్రీలను నమోదు చేయడం జరిగింది ఇందులో 7 వేల 216 గర్భిణి స్త్రీలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు చేయడం జరిగింది మరియు ఆయుష్మాన్ ఆరోగ్య క్రేంద్రాలు మరియు బస్తి దవాఖానల ద్వారా 7 లక్షల 23 వేల 581 మంది బయట రోగులకి చికిత్స ఇవ్వడం జరిగింది.

రాజీవ్ ఆరోగ్య శ్రీ పధకం :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 9వ డిసెంబర్ 2023 తేదిన బీ.పి.ఎల్ కుటుంబాలకు మెరుగైన కార్పొరేట్ ఆరోగ్య బీమా సహాయాన్ని “రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం” ద్వారా 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు పెoచడం జరిగింది. ఈ పథకం లో 1 వేయి 672 వ్యాధులకు ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల ద్వారా చికిత్సలు మరియు శస్త్ర చికిత్సలు అందచేయడం జరుగుతుంది. మన జిల్లాలో గడిచిన ఏడాది కాలంలో 14 వేల 986 మందికి శస్త్ర చికిత్సలకు 40 కోట్ల 52 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.
గ్రామీణ నీటి సరఫరా శాఖ :
జిల్లాలో 17 మండలాలలో 428 గ్రామపంచాయితీలు 719 గ్రామీణ ఆవాసాలు మరియు 6 మున్సిపాలిటీ లలో 1 లక్ష 56 వేల 147 ఇంటి నల్లాలకు గ్రామీణ నీటి సరఫరా పథకo ద్వారా త్రాగునీరు సరఫరా జరుగుచున్నది.
నీటి ఎద్దడి నివారణ కొరకు జిల్లాలో అన్ని నియోజకవర్గల శాసనసభ్యులు తమ ప్రత్యేక నిధుల(SDF) నుండి నిధులు మరియు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్(DMFT) నుండి నిధులు కేటాయించారు. ఈ నిధులతో జిల్లాలో నీటి ఎద్దడి సమస్య రాకుండా తగు చర్యలు తీసుకోవటం జరిగింది.

జిల్లాలో మిషన్ భగీరథ పధకం క్రింద మంచి నీరు అందని ఆలేరు మరియు భువనగిరి నియోజక వర్గం లోని గ్రామాలకు త్రాగు నీరందించుటకు 210 కోట్ల రూపాయలతో పనులను ప్రారంభించాము.

చేనేత మరియు జౌళి శాఖ :
జిల్లాలో 6 వేల 771 చేనేత మగ్గాలు మరియు 2 వేల 240 మర మగ్గాలకు జియో ట్యాగింగ్ చేయబడినది.

నేతన్నకు భీమా పథకములో ఆర్హులైన 10 వేల 686 మంది చేనేత కార్మికులను చేర్చడం జరిగింది. వివిధ కారణాలతో మరణించిన 79 మంది నేత కార్మిక కుటుంబాలకు 3 కోట్ల 95 లక్షల రూపాయలు నామినీలకు లబ్ది చేకూర్చడం జరిగింది.

విద్యుత్ శాఖ :
జిల్లాలో 4 లక్షల 49 వేల 410 వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నాము. 2024-25 సంవత్సరమునకు డిసెంబర్ 2024 వరకు 2 వేల 753 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరిగినది.

రోడ్లు మరియు భవనాలు :
రాష్ట్ర ప్రణాళిక నిధుల క్రింద 3 వంతెనలు మరియు 7 రోడ్ పనులు 456 కోట్ల 25 లక్షల రూపాయలతో 73.9 KM మంజూరై 51.78 KM పూర్తి కాగా మిగిలిన పనులు పురోగతిలో ఉన్నవి.
నాన్ ప్లాన్ నిధుల క్రింద 59 పనులు (310.93 కిలోమీటర్) 191 కోట్ల 24 లక్షల రూపాయలతో మంజూరై, 236.60 కి.మీ పనులు పూర్తి కాగా మిగిలిన పనులు పురోగతిలో ఉన్నవి.

రైల్వే సేఫ్టీ క్రింద ఆలేర్ లో రోడ్ అండర్ బ్రిడ్జి 11 కోట్ల రూపాయల తో మంజురై, పని జరుగుచున్నది. కేంద్రీయ రహదారి నిధులతో 2 రోడ్ పనులు 43 కోట్ల రూపాయలతో మాoజూరై పనులు పురోగతిలో ఉన్నవి.
పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ శాఖ:
2024-25 సంవత్సరములో CRR నిధులతో 20 రోడ్ల నిర్మాణ పనులు మంజూరి కాబడినవి. ఇట్టి పనులు టెండర్ దశలో ఉన్నవి మరియు MGNREGS ద్వారా 18 అంగన్వాడి భవన నిర్మాణ పనులు 1 కోటి 44 లక్షల రూపాయలతో మంజూరై, పనులు పురోగతి లో ఉన్నవి.
పరిశ్రమలు :
TS-iPASS ద్వారా ఇప్పటివరకు 5 వేల 287 కోట్ల 87 లక్షల రూపాయల పెట్టుబడితో 596 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడమైనది. ఈ పరిశ్రమ ద్వారా 23 వేల 969 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది.
టి- ప్రైడ్ పధకం ద్వారా ఇప్పటివరకు 935 మంది షెడ్యూల్డ్ కులముల మరియు షెడ్యూల్డ్ తెగల లబ్దిదారులకు 23 కోట్ల 8 లక్షల రూపాయలు సబ్సిడీ మంజూరి చేయనైనది.
PMEGP పధకం ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరములో 165 యూనిట్లు 5 కోట్ల 86 లక్షల రూపాయలు పెట్టుబడితో స్థాపించబడినవి.

ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ:-
జిల్లాలో గీత కార్మికుల సంక్షేమ కార్యక్రమములో భాగంగా 2024-25 సంవత్సరములో మరణించిన ముగ్గురు మరియు ఒకరు శాశ్వత వికలాoగులకు, 9 మంది తాత్కాలిక వికలాoగులకు గాను 20 లక్షల 90 వేల రూపాయలు ఎక్స్ గ్రేషియా అందజేయడం జరిగినది. తెలంగాణాకు వన మహోత్సవం కార్యక్రమoలో భాగంగా 22 వేల 850 ఈత / ఖర్జూర మొక్కలు నాటడం జరిగింది.
పోలీస్ శాఖ :
మన రాచకొండ పోలీసులు నేరాల నియంత్రణలో మన రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. నేరాల నియంత్రణకై జిల్లాలో అన్ని గ్రామాలలో, పట్టాణాలలో ముఖ్యమైన కూడళ్ళలో 16 వేల 676 సి.సి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిoది.
జిల్లా ప్రజలలో సాంఘిక దురాచారాలపై అన్ని ముఖ్యమైన ప్రాంతాలలో సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తూ ప్రజలలో సరియైన అవగాహన కల్పిస్తున్నారు.యాదాద్రి భువనగిరి జిల్లాలో పరిపాలనను ప్రజలకు చేరువగా తీసుకెళ్ళి అభివృద్ధి ఫలాలను ప్రజలందరికి అందేటట్లు చేయడానికి సహకరిస్తున్న గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు,పాత్రికేయులు, బ్యాంకర్లకు మరియు శాంతి భద్రతలు పరిరక్షిస్తున్న పోలీస్ అధికారులకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు మరియు విద్యార్థిని విద్యార్థులకు శుభాశీస్సులు తెలియచేస్తూ ఇదే స్పూర్తితో అందరము కలిసికట్టుగా పనిచేసి మన జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుదాం.ఆ దిశలో మనమoదరం అంకితమై శ్రమిస్తూ. తెలంగాణ రాష్ట్రం లో యాదాద్రి భువనగిరి జిల్లా ను అగ్రగామిగా నిలుపుదాం.
విద్యార్థిని,విద్యార్థుల చే చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమలు ప్రజలను ఆకట్టుకున్నాయి. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాణ్యమైన విత్తనాలను రైతులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలో పదవ తరగతి లో అత్యధిక మార్కులు సాధించిన 67 మంది విద్యార్థిని, విద్యార్థులకు నిర్మాణ సంస్థ (CSR) రాజేష్ అనూష, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుండి కైలాస్ ల వారి సహకారంతో 67 మందికి సైకిళ్లను బహుమతిగా అందజేయడం జరిగింది.
కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తి , అడిషనల్ డి.సి.పి లక్ష్మీ నారాయణ,జెడ్పీ సి. ఈ. ఓ శోభా రాణి, ఏ సి పి రాహుల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబు రావు, ఆర్డీవో కృష్ణా రెడ్డి, డిఆర్ డి ఓ నాగిరెడ్డి, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, అన్ని శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top